Chaurya Paatham OTT: ఓటీటీలో దుమ్ము రేపుతోన్న చౌర్య పాఠం... సరికొత్త రికార్డు
Chaurya Paatham OTT: థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘చౌర్య పాఠం’ ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతోంది. తాజా లెక్కల ప్రకారం, ఈ సినిమా 120 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను అధిగమించి, డిజిటల్ ప్లాట్ఫామ్ పై సరికొత్త రికార్డ్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రంలో పెద్ద తారాగణం లేదు, భారీ సెట్స్ గానీ, కమర్షియల్ హంగామా గానీ లేదు. కానీ కథ చెప్పే శైలితోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకుడిగా నిఖిల్ గొల్లమారి తన మొదటి ప్రయత్నంలోనే ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు.
వేదాంత్ రామ్ పాత్రలో నటించిన ఇంద్ర రామ్, ఇదే తొలి సినిమా అయినా తన నటనతో ఆకట్టుకున్నాడు. కథ దొంగతనం చుట్టూ తిరిగినా, అది వ్యక్తుల మధ్య ఉన్న విశ్వాసాన్ని, నైతికతను ఆవిష్కరిస్తూ మనసును తాకుతుంది.
త్రినాధరావు నక్కిన, వి. చూడామణి నిర్మించిన ఈ చిత్రం, తెలుగు తో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ విడుదలైంది. ఈ విధంగా అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు చేరువైంది.
ఈ చిత్రానికి అందించిన సంగీతం కూడా కథకు బలం చేకూర్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత బలాన్నిచ్చింది. సింపుల్ నరేషన్ శైలిలో, లోతైన భావోద్వేగాలతో సినిమా సాగిపోవడం కూడా ఒక ముఖ్యమైన విశేషం.