Chaurya Paatham OTT: ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న చౌర్య పాఠం.. 200 మిలియన్ నిమిషాల రికార్డు!

Chaurya Paatham OTT: థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న చౌర్య పాఠం సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది.

Update: 2025-07-27 05:18 GMT

Chaurya Paatham OTT: ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న చౌర్య పాఠం.. 200 మిలియన్ నిమిషాల రికార్డు!

Chaurya Paatham OTT: థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న చౌర్య పాఠం సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది. తాజా లెక్కల ప్రకారం, ఈ చిత్రం 200 మిలియన్ల (20 కోట్ల) స్ట్రీమింగ్ నిమిషాలను అధిగమించి, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా వచ్చి, ఇంత భారీ విజయాన్ని సాధించడం విశేషం. ఈ చిత్రంలో పెద్దగా పేరున్న నటీనటులు లేరు, భారీ సెట్స్ గానీ, కమర్షియల్ హంగామా గానీ లేదు. కానీ కథ చెప్పే విధానంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. దర్శకుడిగా నిఖిల్ గొల్లమారి తన మొదటి ప్రయత్నంలోనే ప్రేక్షకులను మెప్పించి, వారి మనసులను గెలుచుకున్నారు.

వేదాంత్ రామ్ పాత్రలో నటించిన ఇంద్ర రామ్, ఇది తన మొదటి సినిమా అయినా, తన నటనతో ఆకట్టుకున్నాడు. కథ దొంగతనం చుట్టూ తిరుగుతున్నా, అది మనుషుల మధ్య ఉన్న విశ్వాసాన్ని, నైతికతను ఆవిష్కరిస్తూ మనసుకు హత్తుకుంటుంది. త్రినాధరావు నక్కిన, వి. చూడామణి నిర్మించిన ఈ చిత్రం, తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ విడుదలైంది. ఈ విధంగా అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు చేరువైంది.

ఈ చిత్రానికి అందించిన సంగీతం కూడా కథకు బలం చేకూర్చింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత శక్తినిచ్చింది. సింపుల్ కథనం, లోతైన భావోద్వేగాలతో సినిమా సాగిపోవడం కూడా ఒక ముఖ్యమైన విశేషం. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం 200 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ వ్యూస్ రాబట్టి చిన్న సినిమాలలో పెద్ద విజయం సాధించింది. ముఖ్యంగా హీరో ఇంద్ర రామ్ నటనకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. నటుడు ఇంద్ర రామ్ తన రెండవ సినిమాను విభిన్న కథాంశంతో, భారీ బడ్జెట్‌పై చేయబోతున్నట్లు తెలుస్తోంది. 'చౌర్య పాఠం' తో వచ్చిన విజయంతో అతని తదుపరి సినిమాపై అంచనాలు పెరిగాయి.

Tags:    

Similar News