బుల్లితెర హీరో సమీర్ వీరంగం
*తాగిన మత్తులో యువతులపై దౌర్జన్యం * రాత్రి యువతుల ఇంటికెళ్లి దౌర్జనం * డబ్బులు అడిగితే దాడి చేశాడంటున్న యువతులు
Koilamma Serial Hero Amar (file image)
బుల్లితెర హీరో సమీర్ అలియస్ అమర్ రెచ్చిపోయాడు. తాగిన మత్తులో యువతులపై అసభ్యంగా ప్రవర్తించాడు. మణికొండలో బోటిక్ వ్యాపారం చేసుకుంటున్న వారిపై సమీర్ రెచ్చిపోయాడు. రాత్రి 9 గంటల సమయంలో ఒంటరిగా ఉన్న యువతుల ఇంటికి వెళ్లి బెదిరింపులకు దిగారు. తన ప్రియురాలు స్వాతితో కలిసి యువతుల ఇంటికి వెళ్లి రచ్చ చేశాడు.
బొటిక్ వ్యాపారం చేసుకుంటున్న శ్రీవిద్య, అపర్ణలకు అమర్ డబ్బులు ఇవ్వాలి అవి అడిగితే తమపైనే దాడి చేశాడని యువతులు రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు అమర్ నుంచి తమకు ప్రాణహాని ఉందని యువతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు మహిళలకు రక్షణ ఇచ్చారు. అమర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అయితే ఈ కేసులో రాయదుర్గం పీఎస్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.