Actress: యాక్టర్‌గా మారిన డాక్టర్‌.. ఈ చిన్నారి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌

Aishwarya Lekshmi Education: డాక్టర్‌ కావాల్సిందిపోయి యాక్టర్‌ను‌ అయ్యాను... చాలా మంది హీరోయిన్లు ఏదో ఒక సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తరచుగా వినిపిస్తుంటుంది.

Update: 2025-02-01 09:30 GMT

Aishwarya Lekshmi Education Qualification


 డాక్టర్‌ కావాల్సిందిపోయి యాక్టర్‌ను‌ అయ్యాను... చాలా మంది హీరోయిన్లు ఏదో ఒక సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తరచుగా వినిపిస్తుంటుంది. అయితే ఒక నటి నిజంగానే ఇలా డాక్టర్‌ అయ్యాక యాక్టర్‌గా మారింది. పైన ఫొటోలో కనిపిస్తున్న ఆ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్నారు. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?

డాక్టర్‌ నుంచి యాక్టర్‌గా మారిన హీరోయిన్‌ అనగానే మనలో చాలా మంది సాయి పల్లవి పేరే గుర్తొస్తుంది. కానీ మరో హీరోయిన్‌ కూడా ఇలా ఎంబీబీఎస్‌ విద్యను పూర్తి చేసి ఆ తరువాత సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నటిగా మారింది. అంతేకాదు... ఏకంగా అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? పొన్నియన్‌ సెల్వన్‌ మూవీలో తన అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. ఈ హీరోయిన్‌ మరెవరో కాదు అందాల తార ఐశ్వర్య లక్ష్మి.

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుందీ చిన్నది. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఐశ్వర్య 2017లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. విద్యభ్యాసం పూర్తయిన తర్వాత 2014లో మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. 2017లో 'నందలవర నాడు నాడు ఒరు ఆవాలా' సినిమాతో ఐశ్వర్య లక్ష్మి ప్రేక్షకులను పలకరించింది.

ఆ తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంది. మాయనది మూవీలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. ఈ సినిమాకు ఐశ్వర్య లక్ష్మి ఫిల్మ్‌ఫేర్, సైమా, క్రిటిక్స్ అవార్డులను సొంతం చేసుకుంది. గాడ్సే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. పొన్నియన్‌ సెల్వన్‌తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇలా భారీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నా ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు ఈ బ్యూటీ తలుపు తట్టడం లేదనే చెప్పాలి. అయినప్పటికీ ఐశ్వర్య లక్ష్మి మాత్రం నిరాశపడకుండా వచ్చిన ప్రతీ ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. 


Tags:    

Similar News