డాడీ మూవీలోని చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా? చూస్తే షాక్ అవ్వాల్సిందే
Actress: డాడీ మూవీలోని చిన్నరి ఇప్పుడెలా ఉందో తెలుసా? చూస్తే షాక్ అవ్వాల్సిందే
చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ మొదలు పెట్టి హీరోయిన్లుగా మారిన వారు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అయితే కొందరు మాత్రం కేవలం చైల్డ్ ఆర్టిస్టులగానే పరిమితమయ్యారు. ఇదిగో ఇలాంటి జాబితాలోకే వస్తుంది. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి. చిరంజీవి హీరోగా తెరకెక్కిన డాడీ మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోయినా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది.
కాగా ఈ సినిమాలో చిరంజీవి కూతురు పాత్ర ఎంత కీలకమే తెలిసిందే. సినిమా అంతా ఈ చిన్నారి చుట్టే తిరుగుతుంది. ఈ పాత్రలో నటించిన చిన్నారి గుర్తుండే ఉంటుంది. అక్షయ పాత్రలో నటించిన చిన్నారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఆ తర్వాత సినిమాలకు పూర్దిగా దూరమైంది. హీరోయిన్‌గా ప్రయత్నిస్తే మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉన్నా ఆ దిశగా అడుగులు వేయలేదు.
ఈ చిన్నారి పేరు అనుష్క మల్హోత్ర. తాజాగా ఈ చిన్నారికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందంతో ఆకట్టుకుంటోందీ బ్యూటీ. ముంబాయిలో పుట్టి పెరిగిన ఈమె ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హమ్‌లో కుటుంబంతో కలిసి జీవిస్తోంది. డాడీ సినిమా తర్వాత పూర్తిగా చదువుపై దృష్టిసారించడంతోనే అనుష్క సినిమాలకు దూరమైనట్లు సమాచారం.
అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉండే మల్హోత్రా తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటోంది. సుమారు 22 ఏళ్ల తర్వాత అనుష్క ఫొటోలు బయటకు రావడంతో చాలా మంది గుర్తుపట్టడం లేదు. అయితే ఆ కళ్లు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మరి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అయినా అనుష్క మల్హోత్ర తిరిగి వెండి తెరపై కనిపిస్తుందో చూడాలి.