డీ గ్లామర్‌గా కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతోంది
డీ గ్లామర్‌గా కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతోంది
సోషల్ మీడియా యుగంలో ప్రతీది వైరల్ అవుతోంది. ఎక్కడెక్కడో ఉన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్ల ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. పైన ఫొటోలో పుల్లలు ఏరుకుంటున్నట్లు కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? పూర్తిగా డీగ్లామర్ లుక్‌లో కనిపిస్తున్న ఈ చిన్నది ఇప్పుడు తన గ్లామర్‌తో కుర్రకారు హృదయాలను కొల్లగొడుతోంది.
వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఇంతకీ ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా తొలిసారి ప్రేక్షకులను పలకరించింది. 20 ఏళ్ల వయసులోనే హీరోయిన్ స్థాయికి ఎదిగింది బ్యూటీ. దుల్కర్ సల్మన్ హీరోగా తెరకెక్కిన సినిమాతో తెలుగు కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది.
ఈపాటికే ఈ చిన్నది ఎవరో మీకు ఓ క్లారిటీ వచ్చే ఉంటుంది. అవును ఈ హీరోయిన్ మరెవరో కాదు అందాల తార మృణాల్ టాకూర్. ఇక 2018లో విడుదలైన ‘లవ్ సోనియా’ చిత్రంలో మృణాల్ ఇలా డీగ్లామర్ రోల్‌లో నటించి మెప్పించింది. హిందీలో మృణాల్ తొలి సినిమా ఇదే. ఈ సినిమాలోని ఫొటోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పిల్లల స్మగ్లింగ్‌కు సంబంధించిన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ సినిమా మృణాల్ ఒక బోల్డ్ సన్నివేశంలో నటించింది. అయితే హీరోయిన్ బాగా పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత ఈ సన్నివేశాన్ని సినిమాలో నుంచి తొలగించారు. సీతారామమ్ సినిమాతో ఒక్కసారిగా సౌత్ ప్రేక్షకులను తనవైపు తిప్పకుందీ చిన్నది. ఈ సినిమాలో తన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే మృణాల్ తన లేటెస్ట్ గ్లామర్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తోంది.