రాంబంటులో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌.. గుర్తుపట్టారా?

Update: 2025-01-21 09:28 GMT

Rambantu movie childhood artist becomes Famous actress: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని ఏలుతోన్న కొందరు స్టార్‌ హీరో, హీరోయిన్లు ఒకప్పుడు చైల్డ్‌ ఆర్టిస్టులుగా మెప్పించారు. వారిలో కొందరు బాగా పాపులర్ అయ్యారు. ఇంకొందరు మాత్రం పెద్దగైన తరువాత కూడా సినిమాల్లో రాణిస్తున్నప్పటికీ వారి చైల్డ్‌హుడ్ ఐడెంటిటీ కనెక్షన్ మాత్రం మిస్ అవుతున్నారు. అలాంటి వారిలో ఒకరు పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి. రాజేంద్ర ప్రసాద్‌ హీరోగా నటించిన రాంబంటు సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైందీ చిన్నది.

నట వారసత్వం ఉన్నా ప్రస్తుతం తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. దివంగత నటుడు రాజేష్‌ కూతురే ఈ చిన్నారి. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి నటిగా మంచి మార్కులు కొట్టేసింది. వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో మీకు ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చే ఉంటుంది కదూ! అవును మీ గెస్ కరెక్టే ఈ చిన్నది మరెవరో కాదు అందాల తార ఐశ్వర్య రాజేష్‌.

తెలుగు అమ్మాయి అయిన ఐశ్వర్య రాజేష్‌ తమిళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. తమిళంలో మంచి విజయాలను అందుకున్న ఈ చిన్నది ఆ తర్వాత తెలుగులో కౌసల్య కృష్ణమూరి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీశ్ సినిమాల్లో నటించి తెలుగు ఆడియెన్స్‌కు మరింత చేరువైంది.

తాజాగా సంక్రాతికి వస్తున్నాం మూవీతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో వెంకీ భార్యగా, భాగ్యం పాత్రలో తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. దీంతో ఐశ్వర్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్స్‌లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. ఇక సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుందీ చిన్నది. తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్‌ చేసుకుంటుందీ చిన్నది.

Tags:    

Similar News