BoxOffice Clash: సినీ ప్రేక్షకులకు డబుల్ ధమాకా.. ఫస్డ్ డే ఎలా ఉండబోతుందంటే ?
BoxOffice Clash: సినిమా ప్రేక్షకులకు ఈ వారం పెద్ద పండుగ.
BoxOffice Clash: సినీ ప్రేక్షకులకు డబుల్ ధమాకా.. ఫస్డ్ డే ఎలా ఉండబోతుందంటే ?
BoxOffice Clash: సినిమా ప్రేక్షకులకు ఈ వారం పెద్ద పండుగ. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు ఆగస్టు 15కి ఒక్కరోజు ముందు అంటే ఆగస్టు 14న రెండు భారీ పాన్-ఇండియా సినిమాలు విడుదలయ్యాయి. ఒకవైపు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా, మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ కూలి సినిమా. ఈ రెండు సినిమాలు ఒకే రోజు రావడంతో ప్రేక్షకులు థ్రిల్ అవుతున్నారు. లాంగ్ వీకెండ్ కావడంతో ఈ సినిమాల కలెక్షన్స్ రికార్డు స్థాయిలో ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలి సినిమాపై ఉన్న అంచనాలు మామూలుగా లేవు. ఈ సినిమా లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాబోతోందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ గారితో పాటు అమీర్ ఖాన్, నాగార్జున, ఉపేంద్ర, రమ్యకృష్ణ, శృతి హాసన్, సత్యరాజ్ వంటి స్టార్ నటులు నటించారు. ఇది సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ విషయంలో వార్ 2 కంటే కూలి ముందుందని నివేదికలు చెబుతున్నాయి. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
వార్ 2 సినిమా క్రేజ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించడం ఈ సినిమాకు అతిపెద్ద హైలైట్. ఇది ఎన్టీఆర్ మొదటి బాలీవుడ్ సినిమా కావడం విశేషం. ట్రైలర్‌లో వీరిద్దరి డ్యాన్స్, ఫైటింగ్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైంది. కూలి, వార్ 2 వంటి రెండు భారీ బడ్జెట్ సినిమాలు ఒకేరోజు విడుదల కావడంతో బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద యుద్ధం మొదలైంది. ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వస్తాయోనని ప్రేక్షకులు, ట్రేడ్ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.