Allu Arjun- Alia Bhatt: అల్లుఅర్జున్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అంటున్న బాలీవుడ్ బ్యూటీ
Allu Arjun- Alia Bhatt:అల్లుతో ఆలు ఎప్పుడు రొమాన్స్ చేస్తుంది.
Allu Arjun- Alia Bhatt: అల్లుఅర్జున్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అంటున్న బాలీవుడ్ బ్యూటీ
Allu Arjun- Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ "ఆర్ ఆర్ ఆర్" సినిమా త్వరలోనే టాలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కంటే ముందుగానే ఆలియాభట్ నటిస్తున్న హిందీ సినిమా "గంగుభాయ్ కథియవాడి" తెలుగులో కూడా విడుదల కాబోతోంది. ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది అలియా. ఈ నేపథ్యంలోనే ఒక్క ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆలియాభట్ తాను ఈమధ్యనే అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా చూసానని అది తనకి చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది.
"మా ఇంట్లో అందరూ పుష్ప సినిమా చూసి అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ అయిపోయారు. నాకు ఎప్పుడు అల్లు అర్జున్ తో నటించే అవకాశం వస్తుంది అని అడుగుతున్నారు. ఇంట్లో ఉన్నాను అందరూ ఆలు అని పిలుస్తారు. కాబట్టి ఆలు అల్లు తో ఎప్పుడు వర్క్ చేస్తావని వాళ్ల నన్ను ఆటపట్టిస్తున్నారు. ఒక వేళ అల్లు అర్జున్ నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటాను" అని చెప్పుకొచ్చింది ఆలియాభట్. ఒకవైపు "ఆర్ఆర్ఆర్" సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న నెక్స్ట్ సినిమా లో కూడా హీరోయిన్ గా కనిపించనుంది. మరి అల్లు అర్జున్ సరసన ఎప్పుడు కనిపిస్తుందో వేచిచూడాలి.