హార‌ర్ థ్రిల్ల‌ర్‌లో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫ‌తేహి.. కాంచ‌న 4తో కోలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ!

బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి (Nora Fatehi) హారర్ థ్రిల్లర్ కాంచన 4 (Kanchana 4)తో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తమిళ సినిమాపై, బాలీవుడ్‌తో పోల్చి చేసిన ఆసక్తికర కామెంట్స్ తెలుసుకోండి.

Update: 2025-08-20 09:44 GMT

Bollywood beauty Nora Fatehi in a horror thriller.. making a grand entry into Kollywood with Kanchana 4!

బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్, సూపర్ హిట్ మూవీస్, మ్యూజిక్ ఆల్బమ్స్ తో దూసుకుపోతున్న బోల్డ్ బ్యూటీ నోరా ఫతేహి ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న హారర్ కామెడీ థ్రిల్లర్ ‘కాంచన 4’ ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెడుతోంది.

సరైన ప్రాజెక్ట్ అంటూ నోరా కామెంట్స్

“కాంచన 4 ఆఫర్ వచ్చిన వెంటనే ఇది నా తమిళ డెబ్యూ మూవీకి సరైన ప్రాజెక్ట్ అని భావించాను. ఈ ఫ్రాంచైజీకి ఇప్పటికే బలమైన క్రేజ్ ఉంది. స్క్రిప్ట్ చాలా స్పెషల్. Madgaon Express విజయం తర్వాత నేను మరో కామెడీ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఈ ఛాన్స్ రావడం అదృష్టం” అని నోరా ఫతేహి చెప్పింది.

భాషా సవాళ్లు – కానీ ఎంజాయ్ చేస్తా!

“భాష ఎల్లప్పుడూ ఒక ఛాలెంజ్. కానీ నేను సవాళ్లను ఇష్టపడతా. హిందీ, తెలుగు, మలయాళం చేశా.. ఇప్పుడు తమిళంలో అడుగుపెడుతున్నా. నిజంగా ఇది కష్టమైన భాష. అయినప్పటికీ నా లైన్స్ ప్రాక్టీస్‌కి, ఉచ్చారణ మెరుగుపరచుకోవడానికి అదనపు గంటలు వెచ్చిస్తున్నా” అని నోరా చెప్పింది.

కథ చెప్పడంలో వేరే ప్ర‌పంచం

“కామెడీ సీన్స్‌లో నేను ఇంత నేచురల్‌గా ఉంటానని ఊహించలేదని సెట్‌లో అందరూ చెప్పడం నాకు కొత్త ఎనర్జీ ఇస్తోంది. ప్రతి ఇండస్ట్రీకి తనకంటూ స్టైల్ ఉంటుంది. కానీ తమిళ సినిమాలు కథ చెప్పడంలో డెప్త్కి ప్రాధాన్యత ఇస్తాయి. ఇది బాలీవుడ్‌తో పోలిస్తే వేరే ప్ర‌పంచం. రెండు పరిశ్రమలు సినిమాపై ప్యాషన్ కలిగి ఉంటాయి కానీ వర్కింగ్ స్టైల్, ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం భిన్నంగా ఉంటాయి” అని నోరా అభిప్రాయపడింది.

నోరా ఫతేహి – స్పెషల్ సాంగ్స్ నుండి కోలీవుడ్ వరకు

హిందీలో సినిమాలతో పాటు, నోరా తెలుగులో చేసిన స్పెషల్ సాంగ్స్ సూపర్ హిట్స్ అయ్యాయి.

  1. టెంపర్ (ఇట్టాగే రెచ్చిపోదాం)
  2. బాహుబలి (మనోహరి)
  3. కిక్ 2 (కిక్కు)
  4. షేర్ (నాపేరే పింకీ)
  5. లోఫర్ (నొక్కేయ్ దోచేయ్)
  6. ఊపిరి (డోర్ నంబర్)

అలాగే ఈ ఏడాదే కేడీ ది డెవిల్ సినిమాతో కన్నడలో డెబ్యూ చేసింది. ఇప్పుడు కాంచన 4తో కోలీవుడ్‌లో అడుగు పెట్టనుంది.

కాంచన 4 రిలీజ్ కోసం ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఎదురుచూస్తున్నారు. నోరా ఫతేహి ఎంట్రీతో ఈ సినిమా మీద మరింత హైప్ పెరిగింది.

Tags:    

Similar News