Sonu Sood Help to Satyanarayana Family: వారు అనాధలు కాదు.. వారి భాద్యత నాదే : సోనూసూద్

సోనూసూద్‌... ఇప్పుడు ఎక్కడ విన్నా, చూసిన ఇతని పేరే వినిపిస్తుంది. కనబడుతుంది. మొన్నటివరకూ రీల్ లైఫ్‌లో

Update: 2020-07-31 14:21 GMT
Bollywood actor Sonu Sood Helps Satyanarayana Family in Yadadri Bhuvanagiri District Telangana

Sonu Sood Help to Satyanarayana Family: సోనూసూద్‌... ఇప్పుడు ఎక్కడ విన్నా, చూసిన ఇతని పేరే వినిపిస్తుంది. కనబడుతుంది. మొన్నటివరకూ రీల్ లైఫ్‌లో విలనే కావచ్చు కానీ లాక్‌డౌన్ సమయంలో మాత్రం అందరి చేత శభాష్ అనిపించుకొని రియల్‌ హీరోగా మారిపోయాడు. లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పయిన కొన్నివేల మంది వలస కార్మికులను వారివారి స్వస్థలాలకు పంపించి దేవుడు అయ్యాడు. ఇప్పటివరకు వలసకూలీలను ఆదుకున్నాడు. పోనీ అంతటితో ఆగడం లేదు సోనూసూద్‌ .. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు.

తాజాగా యాదాద్రి భున‌వ‌గిరి జిల్లా ఆత్మకూరు మండ‌ల‌ కేంద్రంలోని స‌త్యనారాయ‌ణ, అనురాధ‌కు ముగ్గురు సంతానం ఉన్నారు. ఏడాది క్రితం స‌త్యనారాయ‌ణ అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటినుంచి అనురాధే ఆ ముగ్గురి పిల్లలను కూలీపనికి వెళ్తూ చూసుకుంటుంది. అయితే వారం రోజుల క్రితం త‌ల్లి అనురాధ కూడా అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో స‌త్యనారాయ‌ణ, అనురాధ దంపతుల పెద్ద కుమారుడు మ‌నోహ‌ర్ త‌న చెల్లి, త‌మ్ముడి ఆల‌నా పాల‌నా చూసుకుంటున్నాడు.

ఈ క్రమంలో రాజేశం క‌ర‌ణం అనే ఓ వ్యక్తి ట్విట్టర్ ద్వారా సోనూసూద్ దృష్టికి తీసుకువెళ్ళాడు. దీని పైన స్పందించిన సోనూసూద్ ముగ్గురు పిల్లలు అనాథ‌లు కాద‌ని, ఇక‌పై తాను వారికి అండ‌గా ఉంటాన‌ని, ఇకపై వారి భాద్యత నాదే అంటూ హామీ ఇచ్చాడు. మరో గొప్ప మనసుతో ముందుకు వచ్చిన సోనూసూద్ ని సోషల్ మీడియాలో అందరూ అభినందిస్తున్నారు.

గత కొన్నిరోజుల ముందు సోనూసూద్ చిత్తూరు జిల్లాలోని మదనపల్లె గ్రామంలో ఓ రైతు తన ఇద్దరూ కూతుళ్లతో పొలం దున్నుతూ కష్టపడుతున్న వీడియో ఒకటి చూసి చలించిపోయి హామీ ఇచ్చిన మూడు గంటల్లోనే ట్రాక్టర్ ని సదరు రైతు ఇంటిముందు పెట్టాడు. అంతేకాకుండా లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటున్న సాఫ్ట్ వేర్ శారదకి జాబు ఇప్పించి తన గొప్ప మనసును చాటుకున్నాడు.

Tags:    

Similar News