Sonu Sood Announces 3 Lakh Jobs: సోనూసూద్‌ బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా మూడు లక్షల ఉద్యోగాలు!

Sonu Sood Announces 3 Lakh Jobs: సోనూసూద్‌... ఎక్కడ విన్నా,చూసిన ఇతని పేరే వినిపిస్తుంది. కనబడుతుంది. మొన్నటివరకూ రీల్ లైఫ్‌లో విలనే కావచ్చు కానీ

Krishna
Published on: 30 July 2020 8:53 PM IST
Sonu Sood Announces 3 Lakh Jobs: సోనూసూద్‌ బంపర్‌ ఆఫర్‌.. ఏకంగా మూడు లక్షల ఉద్యోగాలు!
X
sonusood (File Photo)

Sonu Sood announces 3 lakh jobs : సోనూసూద్‌... ఎక్కడ విన్నా,చూసిన ఇతని పేరే వినిపిస్తుంది. కనబడుతుంది. మొన్నటివరకూ రీల్ లైఫ్‌లో విలనే కావచ్చు కానీ లాక్‌డౌన్ సమయంలో మాత్రం అందరి చేత శభాష్ అనిపించుకొని రియల్‌ హీరోగా మారిపోయాడు. లాక్ డౌన్ వలన ఉపాధి కోల్పయిన కొన్నివేల మంది వలస కార్మికులను వారివారి స్వస్థలాలకు పంపించి దేవుడు అయ్యాడు. ఇక ఇది ఇలా ఉంటే ఈ రోజు తన 47 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించాడు సోనూసూద్..

కరోనా సంక్షోభంతో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు గాను తన జన్మదినం కానుకగా 3 లక్షల ఉద్యోగాలను ప్రకటించాడు సోనుసూద్.. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు సోనూసూద్.. "నా పుట్టిన రోజు సందర్భంగా ప్రవాస సోదరులకు ప్రవాసిరోజ్‌గర్‌.కామ్‌లో 3 లక్షల ఉద్యోగాలకు ఒప్పందం కుదుర్చుకున్నాను. మంచి వేతనం, పీఎఫ్‌, ఈఎస్‌ఐతో పాటు ఇతర సదుపాయలు కూడా అందుతాయి" అంటూ పేర్కొన్నాడు సోనూసుద్.. ఇందులో తనకు మద్దతుగా వచ్చిన పలు సం‍స్థలు ధన్యవాదాలు తెలిపాడు సోనూసూద్..

ఇప్పటివరకు వలసకూలీలను ఆదుకొని అంతటితో ఆగడం లేదు సోనూసూద్‌ .. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. తాజాగా చిత్తూరు జిల్లాలోని మదనపల్లె గ్రామంలో ఓ రైతు తన ఇద్దరూ కూతుళ్లతో పొలం దున్నుతూ కష్టపడుతున్న వీడియో ఒకటి చూసి చలించిపోయిన అయన హామీ ఇచ్చిన మూడు గంటల్లోనే ట్రాక్టర్ ని సదరు రైతు ఇంటిముందు పెట్టాడు. అంతేకాకుండా లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి కూరగాయలు అమ్ముకుంటున్న సాఫ్ట్ వేర్ శారదకి జాబు ఇప్పించాడు. ఇంకా సహాయం చేయడానికి నేను సిద్దం అంటూ చెప్పుకొస్తున్నాడు.

Krishna

Krishna

Next Story