Bigg Boss Telugu 5: బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
బిగ్ బాస్ ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకోగా ప్రేక్షకులంతా ఐదవ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Bigg Boss Telugu 5: బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ వీళ్లేనా?
Bigg Boss Telugu Season 5 Contestants List: తెలుగు లో అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి చేసుకోగా ప్రేక్షకులంతా ఐదవ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మూడు మరియు నాలుగవ సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సీజన్ లో కూడా హోస్ట్ గా కనిపించనున్నారని సమాచారం. అయితే బిగ్బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవడం ఉన్నారు అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఫస్ట్ ఎపిసోడ్ మొదలయ్యే వరకూ కూడా కంటెస్టెంట్స్ పేర్లు బయటకు రాకుండా స్టార్ మా వారు జాగ్రత్తపడతారు.
అయినప్పటికీ గత కొన్ని రోజులుగా కొంతమంది పేర్లు బాగానే వినిపిస్తున్నాయి. ప్రేమ కావాలి బ్యూటీ ఇషా చావ్లా, యాంకర్స్ వర్షిని, శివ, లోబో మరియు రవి, నటి సురేఖ వాణి, సింగర్ మంగ్లీ, టీవీ9 న్యూస్ ప్రజెంటర్ ప్రత్యూష, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మరియు టిక్ టాక్ దుర్గారావు బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఈ పుకార్ల లో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.