బిగ్ బాస్ 3 ఎపిసోడ్ 22 హైలైట్స్ : పునర్నవి సేఫ్!
బిగ్ బాస్ షో లో పునర్నవి సేఫ్ జానే లో ఉన్నట్టు నాగార్జున ప్రకటించారు. దీంతో, ఇద్దరు సేఫ్ జోన్ లో ఉన్నారు. బాబా భాస్కర్, వితిక, తమన్నా ఇంకా డేంజర్ జోన్ లో ఉన్నారు.
వస్తూనే హౌస్ మేట్స్ తో ఆట మొదలు పెట్టేశారు నాగార్జున.. అంకితం అనే ఆట ఆడించాడు. 14 కవర్లలో ఒక్కో సాంగ్ పెట్టి ఆ సాంగ్ కి యాప్ట్ ఎవరో చెప్పమన్నారు. ఆట పాటలతో సందడిగా షో నడుస్తుండగా.. ఎలిమినేషన్ నుంచి ఎవరు రెండోవారు సేఫ్ గా ఉన్నారో చెప్పారు. పునర్నవి సేఫ్ జోన్ లో ఉన్నట్టు ప్రకటించారు నాగార్జున. దీంతో రాహుల్, పునర్నవి సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక బాబా భాస్కర్, వితిక , తమన్నా ఎలిమినేష లో డేంజర్ జోన్ లోనే ఉన్నారు.