Bigg Boss Telugu 8: విన్నర్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్.. జాక్ పాట్ కొట్టేసిన విష్ణు ప్రియ..

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షో.. మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది.

Update: 2024-12-09 12:30 GMT

Bigg Boss Telugu 8: విన్నర్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్.. జాక్ పాట్ కొట్టేసిన విష్ణు ప్రియ..

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షో.. మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ షో గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 15న నిర్వహించనున్నట్టు సమాచారం. మొదట ఈ షోలో 14 మంది కంటెస్టెంట్ పాల్గొన్నారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరో 8 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఈ వారం గ్రాండ్ ఫినాలే బరిలో రోహిణి, విష్ణు ప్రియ, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ ఉండగా.. రోహిణి, విష్ణు ప్రియ టాప్ 5 రేస్ నుంచి బయటకు వచ్చారు. శనివారం రోహిణి, ఆదివారం విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యారు. నిఖిల్, గౌతమ్, అవినాష్, నబీల్, ప్రేరణ టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలిచారు. ఇక టైటిల్ కొడుతుందని భావించిన విష్ణు ప్రియ ఊహించని విధంగా ఎలిమినేట్ అయ్యారు. తన ఆటతో ఆడియన్స్ ను బాగానే ఎంటర్ టైన్ చేసింది విష్ణుప్రియ. అయితే బిగ్ బాస్ ఈమె ఆటకు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చింది అనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 8కి 12వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చారు విష్ణుప్రియ. 3 నెలల పాటు హౌస్ లో ఉన్న విష్ణు ప్రియ భారీ రెమ్యూనరేషన్ తో బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. మూడు నెలలకు గాను రూ.56 లక్షల పారితోషికం తీసుకున్నట్టు సమాచారం. దీంతో ఈ అమ్మడు విన్నర్ కంటే ఎక్కువే సంపాదించినట్టు తెలుస్తోంది. ఒక్క సీజన్ లో మాత్రమే ప్రస్తుతం రూ.54 లక్షల వరకు ప్రైజ్ మనీ ఉంది. ఇలా చూస్తే విష్ణుప్రియ 3 నెలల సంపాదన బిగ్ బాస్ 8 తెలుగు టైటిల్ విజేత కంటే అధికంగా ఉందని తెలుస్తోంది.

Tags:    

Similar News