Bigg Boss: జాక్ పాట్‌ కొట్టిన బిగ్‌ బాస్‌ 6 విన్నర్‌ రేవంత్‌.. ప్రైజ్‌మనీతో పాటు..

Bigg Boss Season 6: ఎట్టకేలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ముగిసింది.

Update: 2022-12-19 06:37 GMT

Bigg Boss: జాక్ పాట్‌ కొట్టిన బిగ్‌ బాస్‌ 6 విన్నర్‌ రేవంత్‌.. ప్రైజ్‌మనీతో పాటు..

Bigg Boss Season 6: ఎట్టకేలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ముగిసింది. వంద రోజులకు పైగా రసవత్తరంగా సాగిన ఈ షోలో బిగ్ బాస్ విన్నర్ గా రేవంత్ నిలిచారు. ముందు నుంచి అందరూ ఊహించినట్లు గానే సింగర్ రేవంత్, ఈ సారి బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్నారు. నాగార్జున ఆఫర్ చేసిన 40 లక్షల ప్రైజ్ మనీ తీసుకుని టాప్ 2 నుంచి శ్రీహన్ క్విట్ కావడంతో.. రేవంత్‌ని విజేతగా అనౌన్స్ చేశారు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ అందించే ప్రైజ్‌ మనీలో కోత పడినప్పటికీ బాగానే వెనకేసుకున్నాడు రేవంత్.

యాభై లక్షల ప్రైజ్‌ మనీలో రేవంత్‌కి విన్నర్‌గా దక్కేది పది లక్షలే. మిగితా 40 లక్షలు శ్రీహన్ తీసుకొని రేసు నుంచి తప్పుకున్నాడు. ఈ 10 లక్షలతో పాటు `సువర్ణభూమి` వారి 650 గజాల ఫ్లాట్‌ కూడా పొందాడు. ఈ 650 గజాల ఫ్లాట్‌ ధర సుమారుగా 30 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు పది లక్షల విలువైన బ్రెజా కారు కూడా రేవంత్ సొంతమైంది. ఇక రెమ్మ్యూనరేషన్ పరంగా ఆయనకు మరో 30 లక్షల వరకు వచ్చిందని సమాచారం. ఇలా మొత్తంగా చూస్తే రేవంత్ కి దాదాపు 80 లక్షల రూపాయల వరకు వచ్చిందని తెలుస్తోంది.

Tags:    

Similar News