Bigg Boss: బిగ్‌బాస్ కొత్త సీజన్‌కు డేట్ ఫిక్స్‌.. ఈసారి హౌస్‌మెట్స్‌ ప్రభుత్వమేనంటూ స్టార్ హీరో ఆసక్తికర పోస్టు!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న రియాలిటీ షో బిగ్‌బాస్ కొత్త సీజన్‌కు ముహూర్తం ఖరారైంది. ఇప్పటికే తెలుగు బిగ్‌బాస్‌కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇప్పుడు హిందీలోనూ కొత్త సీజన్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది.

Update: 2025-08-01 13:03 GMT

బిగ్‌బాస్ హిందీ సీజన్ 19 కోసం తాజాగా విడుదలైన ప్రోమోలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒక రాజకీయ నాయకుడి గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ప్రోమోను సల్మాన్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “ఈసారి హౌస్‌మేట్స్‌నే ప్రభుత్వం” అనే క్యాప్షన్ జత చేశాడు.

ఆగస్ట్ 24 నుంచి జియో హాట్‌స్టార్ మరియు కలర్స్ టీవీలో ఈ సీజన్ గ్రాండ్ ప్రీమియర్‌తో ప్రారంభంకానుంది. గత సీజన్ మూడున్నర నెలలు నడిచినప్పటికీ, ఈసారి మొత్తం ఐదున్నర నెలల పాటు ఈ షో కొనసాగనుందని సమాచారం.

ఇక తెలుగు బిగ్‌బాస్ సీజన్‌లో కూడా ఈసారి కామన్ పీపుల్‌కి అవకాశం ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి బిగ్‌బాస్ మళ్లీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధంగా ఉంది!

Tags:    

Similar News