Bigg Boss 9 Telugu Apply: మీరు కూడా బిగ్ బాస్ 9లోకి కంటెస్టెంట్‌గా వెళ్లాలని ఉందా? ఇలా అప్లై చేయండి!
Bigg Boss 9 Telugu Apply: ఇప్పటివరకు ఈ షోలో ముఖ్యంగా సెలబ్రిటీలు, యూట్యూబ్ స్టార్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు, మీకు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం దక్కనుంది. నాగార్జున స్వయంగా ఒక వీడియోలో ఈ విషయాన్ని ప్రకటించారు.
Bigg Boss 9 Telugu Apply: మీరు కూడా బిగ్ బాస్ 9లోకి కంటెస్టెంట్‌గా వెళ్లాలని ఉందా? ఇలా అప్లై చేయండి!
Bigg Boss 9 Telugu Apply: టాలీవుడ్ బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎనిమిది సీజన్ల విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో, త్వరలోనే సీజన్ 9తో ముందుకొస్తోంది. ఈ సీజన్‌కి కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
“ఈసారి చదరంగం కాదు... రణరంగం!” అంటూ నాగార్జున ఇచ్చిన పవర్‌ఫుల్ డైలాగ్ ఇప్పటికే బిగ్ బాస్ కొత్త సీజన్‌పై హైప్ పెంచింది. contestant ఎంపిక ప్రక్రియ జోరుగా సాగుతుండగా, బిగ్ బాస్ టీమ్ ఓ స్పెషల్ అప్‌డేట్ ఇచ్చింది.
ఇప్పుడైతే సామాన్యులకు బంపరాఫర్!
ఇప్పటివరకు ఈ షోలో ముఖ్యంగా సెలబ్రిటీలు, యూట్యూబ్ స్టార్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు మాత్రమే కనిపించేవారు. కానీ ఇప్పుడు, మీకు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం దక్కనుంది. నాగార్జున స్వయంగా ఒక వీడియోలో ఈ విషయాన్ని ప్రకటించారు.
"మీ ప్రేమకు రిటర్న్ గిఫ్ట్గా, ఈసారి మీకూ బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశం ఇస్తున్నాం!" – నాగార్జున
ఎలా అప్లై చేయాలి?
బిగ్ బాస్ సీజన్ 9కి మీరు కూడా రిజిస్టర్ కావాలనుకుంటే, ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవండి:
లింక్ ఓపెన్ చేయండి: https://bb9.jiostar.com
మీ వివరాలు ఎంటర్ చేయండి: పేరు, మొబైల్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయండి.
వీడియో అప్లోడ్ చేయండి:
2–3 నిమిషాల వీడియోలో మీ గురించి వివరించండి.
బిగ్ బాస్ హౌస్‌లోకి మీరు ఎందుకు రావాలనుకుంటున్నారో చెప్పండి.
మీ వ్యక్తిత్వాన్ని హైలైట్ చేయండి!
ఈ వీడియోను బిగ్ బాస్ టీమ్ పరిశీలించి, అర్హత కలిగినవారిని సెలెక్ట్ చేస్తారు. ఇదే మీ కలల ప్రపంచంలోకి అడుగుపెట్టు అవకాశం కావచ్చు!
బిగ్ బాస్ 9 లేటెస్ట్ ప్రోమో..