Bigg Boss Telugu 8 Day 88: కన్నీటి పర్యంతమైన ప్రేరణ.. దెబ్బ కొట్టేశారుగా...

Bigg Boss Telugu 8 Day 88: బిగ్‌బాస్‌ 8వ సీజన్‌ చివరి దశకు చేరుకుంటోంది. దీంతో ఇంట్రెస్టింగ్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది.

Update: 2024-11-29 05:51 GMT

Bigg Boss Telugu 8 Day 88: కన్నీటి పర్యంతమైన ప్రేరణ.. దెబ్బ కొట్టేశారుగా...

Bigg Boss Telugu 8 Day 88: బిగ్‌బాస్‌ 8వ సీజన్‌ చివరి దశకు చేరుకుంటోంది. దీంతో ఇంట్రెస్టింగ్ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. టికెట్‌ టు ఫినాలే రేస్‌ ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ప్రతీ ఎపిసోడ్‌లో గత సీజన్‌కు చెందిన ఇద్దరు చొప్పున హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రకరకాల టాస్క్‌లు ఇస్తూ విన్నర్స్‌ను ప్రకటిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన 88వ ఎపిసోడ్‌లో హౌజ్‌లోకి పునర్నవి, వితికలు ఎంట్రీ ఇచ్చారు. మూడో పోటీదారుడిని ఎంపిక చేసేందుకు వీళ్లు హౌజ్‌లోకి వచ్చారు. అయితే ఈ సందర్భంగా హౌజ్‌లో రచ్చ జరిగింది. టాస్క్‌లో ట్యాలెంట్‌ చూపని వాళ్లకి బ్లాక్‌ బ్యాడ్జ్‌ ఇచ్చే విషయమై కాస్త గలాట జరిగింది.

అందరూ సమానంగా ఆడారు అంటూనే.. ఇది చాలా టఫ్‌ నిర్ణయమని ప్రేరణను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వితిక, పునర్నవిలు.. ప్రేరణకు బ్లాక్‌ బ్యాడ్జ్‌ని ఇచ్చి గౌతమ్‌కు జై కొట్టారు. దీంతో ప్రేరణ ఎమోషన్‌కి గురైంది. 'నేను గేమ్‌ బాగానే ఆడాను' అనే సరికి.. వితికి మాట్లాడుతూ.. ఆ విషయం తమకు తెలుసని గౌతమ్‌, నువ్వు ఆడిన ఆటలో గౌతమ్‌ ఫెయిర్‌గా ఆడాడు అని చెప్పేసింది. దీంతో ప్రేరణ కన్నీటి పర్యంతమైంది.

అయితే అంతకు ముందు హౌజ్‌లో నవ్వులు పూశాయి. ముఖ్యంగా రోహిణి, అవినాష్, టేస్టీ తేజాలు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించారు. ప్రకాష్ అండ్ పరిమిళగా అవినాష్, రోహిణిలు అద్దరగొట్టేశారు. వీళ్ల కామెడీ టైమింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పాలి. మరి ఈ రోజు ఎపిసోడ్‌లో ఎలాంటి మ్యాజిక్‌ జరగనుందో చూడాలి. 

Tags:    

Similar News