Pallavi Prashanth: బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్
Pallavi Prashanth: ప్రశాంత్, రాజును చంచల్‌గూడ జైలుకు తరలింపు
Pallavi Prashanth: బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్
Pallavi Prashanth: బిగ్ బాస్ ఫేమ్, సీజన్-7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యారు. గజ్వేల్ మండలం కొల్గూర్ గ్రామంలోని తన ఇంటి వద్ద పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో అక్కడ కొంత సేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరికి ప్రశాంత్ ను అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు.
బిగ్ బాస్ సీజన్-7 ముగిసిన రోజు హైదరాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియో బయట గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పల్లవి ప్రశాంత్ అభిమానులు బీభత్సం సృష్టించారు. కారు, బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్ తో పాటు మరికొంతమందిపై కేసులు నమోదు అయ్యాయి. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పల్లవి ప్రశాంత్ ను అదుపులోకి తీసుకున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. జడ్జి ముందు పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడిని ప్రవేశపెట్టారు. పల్లవి ప్రశాంత్ తో పాటు ఆయన సోదరుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడిని చంచల్ గూడా జైలుకు తరలించారు.