Bigg Boss 3 Telugu Episode 72: బిగ్ బాస్ అసలు ఆట మొదలైంది.. రాహుల్ మళ్లీ నామినేషన్స్ లోకి..
బిగ్ బాస్ ఇంట్లో అసలు ఆట మొదలైంది. ఫైనల్స్ కి పరుగు మొదలెట్టారు.
బిగ్ బాస్ అసలు ఆట మొదలైంది. సోమవారం ఎలిమినేషన్స్ కి నామినేషన్ లు ఉంటాయి. ఎప్పుడూ జరిగేదానికి భిన్నంగా ఈ ప్రక్రియ చేపట్టాడు బిగ్ బాస్. హౌస్ లో ప్రస్తుతం 9 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. ఈ వారం నుంచి రేస్ టు ఫినాలే మొదలైందని బిగ్ బాస్ ప్రకటించాడు. ఇక రవికృష్ణ వెళ్ళిపోయినందుకు మొదలెట్టిన రాగాలు శివజ్యోతి ఈరోజూ ఆపలేదు. ఆమెకు అలీ కూడా తోడయ్యాడు. ఇక ఇంటి సభ్యులకు రాళ్లే రత్నాలు టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.. ఇవీ ఈ ఎపిసోడ్ విశేషాలు..
కుళాయి కట్టలేదు.. బాబా పై కారాలు మిరియాలు..
రవికృష్ణ వెళ్ళిపోయినందుకు శివజ్యోతి బాధ ఇంకా తగ్గలేదు. అలీ దగ్గర ఏడుస్తూనే ఉంది. ఈ ఏడుపులోకి బాబా భాస్కర్ ని లాగింది. అలీ, శివజ్యోతి ఇద్దరూ బాబా భాస్కర్ వల్లే రవి ఎలిమినేట్ అయ్యారని బాగా ఫిక్స్ అయిపోయారు. బిగ్ బాస్ లో కన్నింగ్ గానే ఉండాలనే నిజాన్ని గ్రహించానని శివజ్యోతి చెప్పింది. ఇక నుంచి ఆట సీరియస్ గా ఆడదామని శివజ్యోతి, అలీ లు గట్టి నిర్ణయానికి వచ్చారు. బాబా సంగతి తేలుస్తానని అలీ శపథం పట్టాడు. ఇక బాబా భాస్కర్ కూడా రవికృష్ణ వెళ్ళిపోయినందుకు బాధ పడ్డారు. అయిదు, శ్రీముఖి ఆయనను ఓదార్చి.. అందరమూ వెళ్లిపోవాల్సిన వాళ్ళమే.. 70 రోజులు కలిసి ఉన్నాడని సంతోషపడాలి అంటూ ధైర్యం చెప్పింది.
రేస్ టు ఫినాలే.. బాటిల్ ఆఫ్ మెడాలియన్..
ఇక ఈ వారం నుంచి రేస్ టు ఫినాలే మొదలైందని బిగ్ బాస్ ప్రకటించారు. ఇందులో వారం అంతా టాస్క్ లు ఉంటాయనీ, వాటిలో పెరఫార్మెన్స్ ఆధారంగా నామినేషన్స్ ఉంటాయనీ బిగ్ బాస్ తెలిపాడు.
బతుకమ్మ సంబరాలు.. రాళ్లకోసం పరుగులాటలు..
బిగ్ బాస్ హౌస్ లో బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఇందుకోసం హౌస్ మేట్స్ అందరికీ కొత్తబట్టలు అందించాడు బిగ్ బాస్. ఇల్లంతా అలంకరించి.. కొత్తబట్టలు వేసుకుని బతుకమ్మ పండుగని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ. అది అయిన వెంటనే బిగ్ బాస్ నామినేషన్ అటు ఆమోదలైంది. 'రాళ్లే రత్నాలు' అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా సభ్యులు అంతా హౌస్ బయట ఉండాలి. లోపలి వెళ్లే అవకాశం ఉండదు. శ్రీముఖి కెప్టెన్ అయినందు వాళ్ళ ఈ టాస్క్ సంచారకురాలిగా వ్యవహరిస్తోంది. ఆమెకు ఒక్కదానికే హౌస్ లోకి వెళ్లే ఎక్సెస్ ఉంటుంది. మిగిలిన వారికి ఫుడ్, బెడ్ అన్నీ ఏక్టివేషన్ ఏరియాలోనే. ఎవరు హౌస్ లోకి వెళ్ళడానికి ప్రయత్నించినా నేరుగా నామినేట్ అవుతారు. ఇక ఆకాశం నుంచి రాళ్లు పడతాయి. అవి 20,50,100,200 విలువలతో ఉంటాయి. ఈ వర్షం పడినపుడు ఆ రాళ్లను ఏరుకోవాలి. వీరికి ఓ స్టోర్ ఉంటుంది. ఆ రాళ్ళ విలువను ఉపయోగించి స్టోర్ నుంచి పదార్థాలు కొనుక్కోవచ్చు. అదేవిధంగా ఒకరి దగ్గర ఉన్న రాళ్లను ఒకరు కాజేయవచ్చు. బజర్ మోగినపుడు ఎవరిదగ్గర రాళ్లు తక్కువ విలువ ఉంటె వాళ్ళు ఎలిమినేషన్స్ కి నామినేట్ అవుతారు. ఇక మొదలైంది ఆట..
ధీమాగా నామినేషన్స్ లోకి వెళ్ళిపోయిన రాహుల్..
రాహుల్ కి నామినేషన్స్ కొత్త కాదు. సేవ్ అవడమూ కొత్తకాదు. అందుకే కాబోలు గేమ్ ను పెద్ద సీరియస్ గా తీసుకోలేదు. రాళ్లు పడుతున్నా తీసుకోవడానికి చాలా సమయం తీసుకున్నాడు. దీంతో మొదటి బజర్ మోగేసరికి రాహుల్ వద్ద రాళ్ళ విలువ తక్కువగా ఉంది. దీంతో అతను డైరెక్ట్ గా నామినేట్ అయ్యారని ప్రకటించాడు బిగ్ బాస్.
నేను ఆట ఆడాను.. బాబ్బాబు తప్పైపోయింది ఆడించారో.. మహేష్ గోల!
రాహుల్ మహేష్ దగ్గర నుంచి రాళ్లను లాక్కోవడానికి ప్రయత్నించడంతో మహేష్ కి కోపం వచ్చింది. తన దగ్గర ఉన్న రాళ్లను అందరికీ ఇచ్చేసి.. నామినేట్ అయినా ఫర్వాలేదు నేను వెళ్ళిపోతా అని గోల చేశాడు. శ్రీముఖి ఎంత నచ్చ చెప్పినా వినకుండా రచ్చ చేశాడు. కొద్దీ సేపటి తరువాత మళ్ళీ వచ్చి నేను గేమ్ ఆడతా నా రాళ్లు నాకు ఇచ్చేయండి అంటూ అందర్నీ బ్రతిమిలాడటం మొదలు పెట్టాడు. అందరూ పోనీలే పాపం అని ఇచ్చేశారు. కానీ, పునర్నవి మాత్రం తనకు మహేష్ ఇచ్చిన 200 విలువకల రాయిని చచ్చినా తిరిగి ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పేసింది. మహేష్ ఎంత బతిమిలాడినా ఇవ్వలేదు పునర్నవి.
పాపం జావతోనే సరిపెట్టుకున్నారు.. స్టోర్ లో ఏది కొనాలన్నా విపరీతమైన ధరలు చెప్పింది శ్రీముఖి.. ఉప్పు 5000, అగ్గిపెట్టె 2000, ఉల్లిపాయలు 500 ఇలా భారీ రేట్లతో భయపడ్డ సభ్యులు అంతా జాగ్రత్తగా ఉన్న డబ్బులు దాచుకోవాలని జావ తో సరిపెట్టుకున్నారు.
మొదటి బజర్ మోగేసరికి రాహుల్ తక్కువ విలువతో నామినేట్ కాగా, వితిక, అలీ, శివజ్యోతి దగ్గర ఎక్కువ విలువ కల రాళ్లు ఉన్నాయి.
మొత్తమ్మీద ఎపిసోడ్ ఎంటర్ టైనింగ్ గా సాగింది. టాస్క్ కూడా కొంత నయమనిపించింది. కాకపొతే టాస్క్ కోసం సభ్యులకు ఇచ్చిన డ్రెస్ లు మరీ దారుణంగా ఉన్నాయి. ఆ డ్రస్ లో హౌస్ మేట్స్ ని చూస్తే జాలనిపించేలా ఉన్నాయి. వరుణ్, అలీ చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. 20 విలువైన దానిని కూడా జాగ్రత్తగా లెక్కేసుకుంటున్నారు. ఆట కొత్తరకంగా అనిపించి తరువాత ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ కలిగించింది.
బిగ్ బాస్ 3 తెలుగు విశేషాలు ఇంగ్లీష్ లో చదవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి!