బిగ్ బాస్ లో నటి ఆత్మహత్యా ప్రయత్నం!

బిగ్ బాస్ సీజన్ 3 వివాదాస్పదంగా నడుస్తోంది. తమిళ బిగ్ బాస్ లో నటి మధుమిత ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని తెలుస్తోంది. ఆమెను హౌస్ లోంచి బయటకు పంపించేశారు.

Update: 2019-08-19 02:06 GMT

తమిళ బిగ్ బాస్ ప్రారంభం నుంచీ వివాదాలతో అట్టుడుకుతోంది. ఇంటా, బయటా ఆ షో కు తమిళనాట పలు చిక్కులు వరుసగా ఎదురవుతూనే ఉన్నాయి. కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న తమిళ బిగ్ బాస్ వివాదాలకు కేరాఫ్ ఎడ్రస్ గా మారిపోయింది.

తాజాగా తమిళ బిగ్‌బాస్‌ హౌస్‌ లో హాస్య నటి మధు మిత ఆత్మహత్యాయత్నా నికి పాల్పడింది. తమిళంలో ఒరు కల్‌ ఒరు కన్నాడీ చిత్రంలో హాస్య పాత్రలో నటించిన మధుమిత బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో పోటీ చేస్తున్నారు. 50 రోజులకు పైగా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న మధుమిత ప్రస్తుతం హౌస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శనివారం అనుకోకుండా ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆమెను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేశారు. హౌస్‌ సభ్యుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మధు మిత చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తమిళ బిగ్ బాస్ మూడు సీజన్లూ వివాదాస్పదంగా మారడం విశేషం.


Tags:    

Similar News