Bigg Boss 3 Episode 73 highlights: వరుణ్ ముక్కు పగిలింది.. అయినా ఫలితం దక్కలేదు!

నామినేషన్స్ టాస్క్ రాళ్ళే రత్నాలు టాస్క్ పూర్తయింది. రాహుల్, వరుణ్, పునర్నవి, మహేష్ విట్టా ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.

Update: 2019-10-02 02:26 GMT

రాళ్ళే రత్నాలు టాస్క్ పూర్తయింది. వరుణ్ వితికల రొమాంటిక్ టచ్ ఈ టాస్క్ కి స్పెషాలిటీగా నిలిచింది. నామినేషన్స్ కోసం ఇచ్చిన 'రాళ్ళే రత్నాలు' టాస్క్ లో భాగంగా సోమవారం రాహుల్ నామినేషన్ లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు మిగిలిన టాస్క్ పూర్తయింది. టాస్క్ మాత్రం ఇంటి సభ్యులకు చుక్కలు చూపించింది. పడుకోవడానికి దుప్పటి కావలన్నా కొనుక్కోవలసిన పరిస్థితి. టాస్క్ లో ఎక్కువ సంపాదించాలి.. దానికి కష్టపడాలి, తెలివి ఉపయోగించాలి. ఇక సంపాదించినది జాగ్రత్తగా ఖర్చు చేయాలి. లెక్కగా ఉండాలి. లేదంటే నామినేట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. ఎవరికీ వారు ఎంతో జాగ్రత్తగా ఆడినా.. చివరికి చిన్న చిన్న పొరపాట్లతో నామినేషన్ కి వెళ్ళే పరిస్థ్తితి తెచ్చుకున్నారు. పునర్నవి, వరుణ్, మహేష్ విట్టా నమినేషన్స్ లోకి వెళ్ళిపోయారు. ఇక దీంతో మొత్తం నలుగురు నామినేషన్ లో ఉన్నట్టయింది. ఇప్పుడు ఆట రసకందాయంలో పడింది. ప్రేమ పులిహోర జంట నామినేషన్స్ లో ఉన్నారు. మరి ఈ వారం వారిని విడదీస్తారో.. డబుల్ అంటూ ఇద్దర్నీ పంపిస్తారో.. లేకపోతే ఆటలో అరటిపండులా ఉన్న మహేష్ ని పంపించేసి తమ హౌస్ లో రోమాన్స్ ని కాపడుటారో బిగ్ బాస్ కే ఎరుక!

ఎపిసోడ్ మొదట్లో వితిక.. వరుణ్ గొడవ పడ్డారు. రాళ్ళ కోసం ఒకరిని ఒకరు తోసుకునే క్రమంలో వరుణ్ కి దెబ్బ తగిలింది. రక్తం వచ్చింది. దాంతో వితిక అందర్నీ ఎకిపారేసింది. దానిని వారిస్తూ వరుణ్ అడ్డువచ్చాడు. దాంతో ఓ కోటా అతనికీ పడింది. ఇద్దరూ కాసేపు అరుచుకుని సీన్ క్రియేట్ చేశారు. ఇక వితిక హార్ట్ అయింది.. బుంగమూతి పెట్టింది.. మామూలేగా.. కానీ, వరుణ్ ఊరుకోడుగా భర్త కదా బతిమాలుకోవాలి పాపం. కాకపొతే రొమాంటిక్ గా బతిమిలాడి ఒక హాగ్ ఇచ్చి నిన్ను వదలనని పట్టుకుని మొత్తానికి భార్యతో సయోధ్య కుదుర్చుకున్నాడు. ఇవీ ఈ ఎపిసోడ్ విశేషాలు


Tags:    

Similar News