NTR 30 Movie : ఎన్టీఆర్, త్రివిక్రమ్ : బిగ్ అప్డేట్!

NTR 30 Movie : అరవింద సమేత వీర రాఘవ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే

Update: 2020-08-31 09:28 GMT

NTR, Trivikram

NTR 30 Movie : అరవింద సమేత వీర రాఘవ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఇది ఎన్టీఆర్ కి 30వ సినిమా కావడం విశేషం.. ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ - కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు త్రివిక్రమ్. వచ్చే ఏడాది సమ్మర్ కి సినిమాని రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది.

అయితే ఈ సినిమా నుంచి సినిమా అప్డేట్ కావాలంటూ అభిమానుల నుంచి ఎక్కువ సందేశాలు రావడంతో చిత్రనిర్మాతల్లో ఒకరైనా నాగ వంశీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. " మేము షూటింగ్‌ మొదలు పెట్టిన వెంటనే సినిమాకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తాం. టైటిల్‌ను ప్రకటించడం కూడా మాకు కాస్త సెంటిమెంట్‌. అందుకే చెప్పలేకపోతున్నాం. ఒక పెద్ద విశేషంతో మీ ముందుకు వస్తాం " అని నాగవంశీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ లో పట్టాలేక్కనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరనస పూజా హేగ్దే హీరోయిన్ గా నటించనుందని సమాచారం...తమన్ సంగీతం అందించనున్నాడు.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇందులో ఎన్టీఆర్ తో పాటుగా రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు.. ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 2021 జనవరి 8న రిలీజ్ చేయనున్నారు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. సినిమా పైన భారీ అంచనాలు పెరిగాయి.  

Tags:    

Similar News