పవన్ ఫ్యాన్స్ మీకో బిగ్ అప్ డేట్.. #OG ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే...?

Pawan Kalyan: వరుస సినిమాలను లైన్ లో పెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అదే జోష్ లో షూటింగ్ పనులను పరుగులు పెట్టించేస్తున్నాడు.

Update: 2023-05-04 10:15 GMT

పవన్ ఫ్యాన్స్ మీకో బిగ్ అప్ డేట్.. #OG ఫస్ట్ లుక్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే...?

Pawan Kalyan: వరుస సినిమాలను లైన్ లో పెట్టిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అదే జోష్ లో షూటింగ్ పనులను పరుగులు పెట్టించేస్తున్నాడు. దర్శకుడు హరీష్ శంకర్ నేతృత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న పవన్ గ్యాప్ ఇవ్వకుండా #OG సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చేశారు. సాహో ఫేం సుజిత్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను RRR నిర్మాతలు డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ముంబైలో రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టిన సుజిత్ అక్కడ తొలి షెడ్యూల్ ను పూర్తి చేశాడు. ఈ షెడ్యూల్ లో పవన్ పై భారీ యాక్షన్ సన్నివేశాలను సుజిత్ తెరకెక్కించాడు. ఇది పూర్తైన వెంటనే సెకండ్ షెడ్యూల్ ని పూణేలో మొదలు పెట్టేశాడు. ఈ షెడ్యూల్ లో పవన్ తో పాటు హీరోయిన్ ప్రియాంక పాల్గొంటోంది. అలాగే ఇతర నటీనటులు కూడా ఈ షెడ్యూల్ లో భాగం అయ్యారు. ఈ షెడ్యూల్ లో ప్రధానంగా పవన్, ప్రియాంకల మధ్య వచ్చే సన్నివేశాలను సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. అక్కడే ఒక పాట కూడా షూట్ చేస్తారని తెలుస్తోంది.

బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ పూర్తి చేసుకుంటున్న #OG గురించి మేకర్స్ మరో సెన్సేషనల్ అప్ డేట్ ఇచ్చారు. పూణే షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే హైదరాబాద్ లో మూడవ షెడ్యూల్ ని ప్రారంభిస్తామని చెప్పారు. అంతేకాదు, ఈ షెడ్యూల్ పూర్తవ్వగానే పవన్ కల్యాణ్ కి సంబంధించిన లుక్ ని రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ ఇదే నెలలో ఉంటుందని ఫిలిమ్ నగర్ లో ఊహాగానాలు చెలరేగుతున్నాయి. #OG మూవీకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ను మూవీ టీం విడుదల చేసిన ప్రతిసారీ సోషల్ మీడియా షేక్ అయింది. కేవలం వర్కింగ్ స్టిల్స్ తోనే పూనకాలు తెప్పించిన పవన్..తన ఫస్ట్ లుక్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News