Saif Ali Khan: సైఫ్‌పై దాడి కేసులో కీలక మలుపు.. కథ మొదటికి వచ్చిందిగా..!
Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఎంత పెద్ద చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Saif Ali Khan: సైఫ్‌పై దాడి కేసులో కీలక మలుపు.. కథ మొదటికి వచ్చిందిగా..!
Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఎంత పెద్ద చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే అగ్ర హీరో ఇంటిలోకి ఒక దొంగ వచ్చి దాడి చేయడం యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే సైఫ్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ కేసు విచారణలో ఊహించని ట్విస్ట్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. బాంద్రా పోలీసులు ఈ కేసును విచారిస్తుండగా.. నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలను సేకరించారు. అయితే సైఫ్ ఇంట్లో దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్‌తో నిందితుడి వేలి ముద్రలు మ్యాచ్ కావడం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో అసలు ఇంట్లోకి ఎంత మంది వచ్చారన్న అంశం తెరపైకి వచ్చింది.
జనవరి 16వ తేదీన షరీఫుల్ ఇస్లాం సైఫ్ ఇంట్లోకి ప్రవేశించి దాడి చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే ఆ తర్వాత సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ దాదాపు 19 వేలిముద్రలను సేకరించారు. అయితే వీటిలో ఏ వేలిముద్ర కూడా నిందితుడు ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ కావడం లేదని సమాచారం. తదుపరి పరీక్షల కోసం మరోసారి ఘటనా స్థలం నుంచి మరిన్ని వేలిముద్రల నమూనాల్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నట్లు తేలింది.
కాగా కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు సైఫ్ బ్లడ్ శాంపిల్స్‌ను, ఆయన ధరించిన దుస్తులను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇక విచారణలో తేలిన వివరాల ప్రకారం.. నిందితుడు షరీఫుల్ ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని.. అయితే, పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. అందుకే దాడి సమయంలో సైఫ్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించడంతో అవి సైఫ్ అలీఖాన్‌వేనా.. కాదా అని నిర్ధరించడం కోసం నమూనాలు సేకరించారు. దుండగుడి దుస్తులను, సైఫ్ రక్తనమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు.