మహాశివరాత్రి కానుకగా యంగ్ హీరో నితిన్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం 'భీష్మ' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. 'ఛలో' సినిమాతో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుని విమర్శల ప్రసంశలు దక్కించుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. పాటలు, ట్రైలర్‌కు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ప్రేక్షకుల అంచనాలను 'భీష్మ' అందుకుందని, సినిమా చూసినవాళ్లు అంటున్నారు. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు నడిచాయి. అక్కడ ఈ సినిమా చూసినవాళ్లు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
'భీష్మ' ప్రథమార్థం అదిరిపోయిందట. మరో 'గుండెజారి గల్లంతయ్యిందే' రేంజ్ లో కామెడీ పండించారని తెలుస్తోంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ కూడా అదిరిపోయిందని అంటోన్నారు. సరదా సరదా సన్నివేశాలతో సినిమాను ఎక్కడా బోర్ కొట్టించకుండా దర్శకుడు వెంకీ కుడుముల లాగించేశారట. ఇక నితిన్ ఈ సినిమాలో సూపర్‌గా నటించారని అంటున్నారు. చాలా కాలం తర్వాత నితిన్‌కు పర్ఫెక్ట్ రోల్ దొరికిందని ట్వీట్ చేస్తున్నారు.
సెకండాఫ్‌లో దర్శకుడు అసలు కథలోకి తీసుకెళ్లారని ట్వీట్ల ద్వారా తెలుస్తోంది. ద్వితీయార్థం కొంచె ల్యాగ్ ఉన్నా కమర్షియల్ ఎలిమెంట్స్, కామెడీతో కవర్ చేసేశారట. మొత్తంగా చూసుకుంటే బొమ్మ హిట్టు అని అంటున్నారు. అయితే భీష్మలో కొన్ని సన్నివేశాలు గత చిత్రాలను పోలి ఉంటున్నాయని అంటున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల కామెడీ, కమర్షియల్ అంశాలతో ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టకుండా చేశారని ప్రస్తుతానికి వస్తోన్న టాక్. అయితే సినిమా పక్కా హిట్టు అని అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.
#Bheeshma second half done .spot on 👌👌 Story nundi deviate avakunda fun elements tho,konni twist la tho Baga Ochindhi. Overall chala bagundi.Hittu kottesaru bayya. @actor_nithiin @VenkyKudumula @iamRashmika @vennelakishore was too good with his timing alongside raghubabu garu.
— Anvesh (@Anvesh931) February 20, 2020
Bomma block buster
— SURAM MANI (@mani_suram) February 20, 2020
I can't stop laughing
Chimpesaru whole crew ,a must watch film #bheeshma@VenkyKudumula @actor_nithiin @iamRashmika @SitharaEnts
2nd half also good going #Bheeshma
— DM bro (@unoshaik4) February 20, 2020
Okay then... Commercial film with good comedy scenes
— Pokiri (@Karl_marx_07) February 20, 2020
BAN,Maharshi,AD ivi 3 mix chesar ani talk occhina kuda...Easy ga Box Office hit. B'coz, Commercial with comedy elements...
So easy ga Breakeven aipoddi 👍... Dry season lo commercial 👍#Bheeshma