Breaking News: పవర్‌స్టార్ అభిమానులకు గుడ్‌న్యూస్
Breaking News: భీమ్లానాయక్ మూవీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్
పవర్‌స్టార్ అభిమానులకు గుడ్‌న్యూస్
Breaking News: పవర్‌స్టార్ అభిమానులకు గుడ్‌న్యూస్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భీమ్లానాయక్ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 25న సినిమా రిలీజ్‌కు చిత్రయూనిట్ ముహూర్తం ఖరారు చేసింది. కొత్త రిలీజ్ డేట్‌తో చిత్ర బృందం ఓ ట్వీట్ చేసింది. పవర్ తుపానుకు డేట్ ఫిక్స్ అయింది అని ట్వీట్‌లో తెలిపింది. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. కొవిడ్ థర్డ్ వేవ్, ఇతరత్రా కారణాల దృష్ట్యా వాయిదా పడింది. పరిస్థితులు మెరుగుపడటంతో రెండు విడుదల తేదీలను చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. ఫిబ్రవరి 25న లేదా ఏప్రిల్ 1న విడుదల చేసేలా ప్రణాళిక వేసింది. అయితే.. తాజాగా ఫిబ్రవరి 25నే ఖరారు చేసింది.