'భీమ్లా నాయక్' నుంచి రానా స్పెషల్ వీడియో.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న..

Bheemla Nayak: భీమ్లా నాయక్ నుంచి రానా బర్త్‌డే స్పెషల్ వీడియోను మూవీ టీమ్ రిలీజ్ చేసింది.

Update: 2021-12-14 14:22 GMT

'భీమ్లా నాయక్' నుంచి రానా స్పెషల్ వీడియో.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న..

Bheemla Nayak: భీమ్లా నాయక్ నుంచి రానా బర్త్‌డే స్పెషల్ వీడియోను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌గా వస్తున్న ఈ మూవీలో పవన్‌కు ధీటైన పాత్రలో రానా నటిస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించి పవన్‌పై విరుచుకుపడే డైలాగ్స్‌తో రానా వీడియోను వదిలారు. భీమ్లానాయక్‌లో రానా పాత్ర ఏ స్థాయిలో ఉంటుందో ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది.

ప్రస్తుతం డానియల్ శేఖర్ పవర్ ఫుల్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోదంది. ఈ చిత్రానికి సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం 2022 జనవరి 12న విడుదలకానుంది.

Full View


Tags:    

Similar News