మురళీధరన్ బయోపిక్‌లో నటించొద్దు.. విజయ్ కి సలహా!

Bharathiraja Asks Vijay Sethupathi : శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా "800" అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..

Update: 2020-10-16 04:08 GMT

Bharathiraja Asks Vijay Sethupathi : శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా "800" అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. ఈ సినిమాని మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, డార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ కూడా విడుదల చేశారు మేకర్స్ .

అయితే ఈ సినిమాలో విజయ్ నటించడం పట్ల తమిళ సంఘాలు మండిపడుతున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా మంది విజయ్ ని ట్రోల్స్ కూడా చేశారు. 'షేమ్ ఆన్ విజయ్ సేతుపతి' అనే హ్యాష్‌ట్యాగ్‌ కూడా ట్విటర్లో ట్రెండ్ అయింది. అయితే తాజాగా ఈ బయోపిక్ పైన సీనియర్ దర్శకుడు భారతీరాజా స్పందించారు. శ్రీలంక మత వాదానికి పూర్తిగా మద్దతు పలికి ఇండియాకు నమ్మకద్రోహిగా మిగిలిన మురళీధరన్ బయోపిక్ లో విజయ్ నటించడం సరికాదని అన్నారు.

విజయ్ ఈ బయోపిక్ లో నటించడం వలన చాలా ఇబ్బందులు ఎదురుకుంటాడని, ఆయన కెరీర్‌పైనా ప్రభావం చూపే అవకాశం ఉందని గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. భారతీరాజాతో పాటుగా దర్శకుడు శీను రామస్వామి కూడా ఇదే విషయాన్నీస్పష్టం చేశారు. అటు ఈ సినిమాని 2021 చివరికల్లా రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. చూడాలి మరి ఎం జరుగుతుందో!

ఇక మురళీధరన్ క్రికెట్ విషయానికి వచ్చేసరికి 1972, ఏప్రిల్ 17న శ్రీలంకలోని క్యాండీలో తమిళ హిందూ కుటుంబంలో.. సిన్నసామి ముత్తయ్య, లక్ష్మీ దంపతులకు జన్మించారు మురళీధరన్ .టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో ఎనమిది వందల వికెట్లు తీసి ఘనతని సాధించి రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన ఏకైక క్రికెటర్ మురళీధరన్ కావడం విశేషం.. అటు వన్డేలో 534 వికెట్లు తీశాడు. చివరగా మురళీధరన్ 2011 ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్ ఆడి క్రికెట్ లైఫ్ కి గుడ్ బై చెప్పాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా కొనసాగుతున్నాడు.

Tags:    

Similar News