Baahubali The Epic: ఓటీటీలోకి ‘బాహుబలి: ది ఎపిక్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Baahubali: The Epic OTT Release Date Out: తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ప్రభాస్-రాజమౌళిల విజువల్ వండర్ 'బాహుబలి'.
Baahubali The Epic: ఓటీటీలోకి ‘బాహుబలి: ది ఎపిక్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Baahubali: The Epic OTT Release Date Out: తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన ప్రభాస్-రాజమౌళిల విజువల్ వండర్ 'బాహుబలి'. ఈ సినిమా విడుదలై పదేళ్లు కావస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. రెండు భాగాలను కలిపి 'బాహుబలి: ది ఎపిక్' (Baahubali: The Epic) పేరుతో ఇటీవల రీ-రిలీజ్ చేయగా, ఇప్పుడు ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా డిసెంబర్ 25 (క్రిస్మస్) నుంచి స్ట్రీమింగ్ కానుంది.
థియేట్రికల్ రన్ కంటే భిన్నంగా ఉండబోతోందా?
అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ ఎడిట్‌లో దాదాపు 90 నిమిషాల నిడివిని తగ్గించారు. ముఖ్యంగా అవంతిక లవ్‌స్టోరీ, 'పచ్చ బొట్టేసిన', 'కన్నా నిదురించరా' వంటి పాటలతో పాటు కొన్ని యుద్ధ సన్నివేశాలను తొలగించి సినిమాను వేగంగా నడిపించారు. అయితే, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న వెర్షన్‌లో ఆ తొలగించిన సన్నివేశాలను మళ్ళీ జోడిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అభిమానులు మాత్రం ఫుల్ లెంగ్త్ ఎపిక్ కోసం ఎదురుచూస్తున్నారు.
రీ-రిలీజ్‌లోనూ బాక్సాఫీస్ షేక్
సాధారణంగా రీ-రిలీజ్ సినిమాలకు వచ్చే స్పందన కంటే బాహుబలికి వచ్చిన స్పందన అద్భుతం. మొదటి రోజే దేశవ్యాప్తంగా రూ. 9.25 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 18 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, రీ-రిలీజ్ సినిమాల్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది.