ఐమాక్స్ వద్ద కత్తి మహేష్‌పై దాడి

సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేష్‌పై ఐమాక్స్ వద్ద దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు అయన కారుపై

Update: 2020-02-14 11:02 GMT

సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేష్‌పై ఐమాక్స్ వద్ద దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు అయన కారుపైదాడి చేయడంతో కారు అద్దాలు ద్వంసం అయ్యాయి. దీనితో కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ రోజు హీరో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను చూసేందుకు వచ్చిన కత్తి మహేష్ పైన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దాడి చేసిన వారిని అడుపులోకి తీసుకున్నారు.

గత కొద్ది రోజులుగా కత్తి మహేష్ హిందువులు ఎంతో ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముడిపైన కత్తి అనుచిత వాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపైన కత్తి మహేష్ తన ఫేస్ బుక్ ఖాతాలో స్పందిస్తూ "నేను బాగానే ఉన్నాను.. కంగారు పడాల్సిన అవసరం లేదని" పోస్ట్ పెట్టారు. గతంలో కూడా కత్తి మహేష్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే.. 

Full View


Tags:    

Similar News