Ashwin Babu: ధర్మరక్షణ కోసం.. వచ్చినవాడు గౌతమ్..

Update: 2025-05-15 13:00 GMT

Ashwin Babu: ధర్మరక్షణ కోసం.. వచ్చినవాడు గౌతమ్..

Ashwin Babu: విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు మరో ఆసక్తికర ప్రాజెక్ట్‌తో ముందుకొస్తున్నారు. 'వచ్చినవాడు గౌతమ్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక మెడికో థ్రిల్లర్ కానుంది. ఈ చిత్రానికి మామిడాల ఎం.ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, టి. గణపతి రెడ్డి లావిష్ ప్రొడక్షన్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభించింది. తాజాగా మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ మరియు హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేశారు.

‘ధర్మం దారి తప్పినప్పుడు... ఏ అవతారం రానప్పుడు... వచ్చినవాడు గౌతమ్’ అంటూ హీరో మంచు మనోజ్ పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ఈ టీజర్ ఆసక్తిని రేపింది. మొదటి ఫ్రేమ్ నుంచే థ్రిల్లింగ్ మూడ్ సెట్ చేస్తూ, కథ పట్ల ఆసక్తి పెంచింది. అశ్విన్ బాబు పాత్రలో పవర్‌ఫుల్, ఇంటెన్స్, మిస్టీరియస్ లుక్ ఆకట్టుకుంటోంది. ఆయ‌న బాడీ లాంగ్వేజ్, యాక్షన్ టైమింగ్ ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తున్నాయి. టీజర్‌లో చూపిన యాక్షన్ సీక్వెన్స్‌లు కొత్తదనాన్ని అందించగా, కథలోని ఎమోషనల్ ఇంటెన్సిటీ దీని డెప్త్‌ని తెలియజేస్తుంది.

ఈ సందర్భంగా అశ్విన్ బాబు మాట్లాడుతూ.. "టీజర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ కృష్ణ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. మీరు ఊహించలేని పాయింట్‌తో ఈ సినిమా రాబోతోంది. 100% మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. మనోజ్ అన్న వాయిస్ టీజర్‌కి మరో లెవెల్ ఇచ్చింది. శైలేష్ కొలను గారి చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. మా టీజర్‌ని సక్సెస్ చేసిన అందరికీ ధన్యవాదాలు” అన్నారు.

Full View


Tags:    

Similar News