Benerjee: మోహ‌న్ బాబు నన్ను కొట్ట‌డానికి వ‌చ్చారు.. కంటతడి పెట్టిన బెనర్జీ..

Benerjee: 'మా' ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి క్రాస్ ఓటింగ్ జరిగింది రాత్రికి రాత్రే ఫలితాలు మార్చేశారు పోస్టల్ బ్యాలెట్ లు ఇంటికి తీసుకెల్లారు.

Update: 2021-10-12 14:45 GMT

Benerjee: మోహ‌న్ బాబు నన్ను కొట్ట‌డానికి వ‌చ్చారు.. కంటతడి పెట్టిన బెనర్జీ..

Benerjee: 'మా' ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి క్రాస్ ఓటింగ్ జరిగింది రాత్రికి రాత్రే ఫలితాలు మార్చేశారు పోస్టల్ బ్యాలెట్ లు ఇంటికి తీసుకెల్లారు. ఇవీ ప్రకాష్ అండ్ కో ప్రెస్ మీట్ లోని సంచలన ఆరోపణలు. ఇదే సమయంలో అందరూ ఊహించినట్లే ఆత్మా లాంటి ఆలోచనే లేదని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' ఎలక్షన్ ముగిసినా ఎమోషనల్ డ్రామా మాత్రం కంటిన్యూ అవుతోంది.! నిన్న తన సభ్యత్వానికి రాజీనామా చేస్తూనే దానివెనుక పెద్ద ట్విస్ట్ ఉందంటూ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్ ఇవాళ 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణుకు ఊహించని షాకిచ్చారు. తనతో సహా ప్యానెల్‌లో గెలిచిన 11మంది సభ్యులు పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ప్రకాష్‌రాజ్ సంచలన ఆరోపణలు చేస్తే సీనియర్ నటుడు బెనర్జీ బోరున విలపిస్తూ ఎమోషనల్ అయ్యారు. మొత్తంగా 'మా' ఎలక్షన్ లొల్లి క్షణక్షణానికి నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంటోంది.

'మా' కొత్త ప్రెసిడెంట్ మంచు విష్ణుకు ప్రకాష్‌రాజ్‌ సంధించిన లేఖలో కీలక వ్యాఖ్యలు చేశారు. సంస్థ ముందుకెళ్లాలంటే అందరి ఆలోచనలూ ఒకేలా ఉండాలన్నారు. ఇదే సమయంలో నరేష్ పైనా లేఖలో సంచలన ఆరోపణలు చేశారు. నరేష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నారనీ, 'మా' కోసం ఏ పనీ జరగనివ్వని పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. జరిగిన మంచి పనులపైనా బురదచల్లారని ఫైర్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో విష్ణు గెలుపుతో మళ్లీ 'మా'లో మాకు భిన్నాభిప్రాయాలు వచ్చే ఛాన్స్ ఉందన్నారు. దీంతో విష్ణును నరేష్ వెనుకుండి నడిపించడాన్ని ఇన్‌డైరెక్ట్‌గా ప్రస్తావించినట్లయింది. ఈ కారణాలతోనే పదవులకు రాజీనామా చేస్తున్నామని, అభివృద్ధి జరగని పక్షంలో ప్రశ్నిస్తూనే ఉంటామని లేఖలో పేర్కొన్నారు.

ఇదే సమయంలో ప్రకాష్‌రాజ్ సంచలన ఆరోపణలు చేశారు. 'మా' ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లోనూ అక్రమాలు జరిగాయన్న ప్రకాష్ రాజ్ కౌంటింగ్‌కు రెండు రోజులు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. రాత్రికి రాత్రే ఎన్నికల ఫలితాలు మార్చేశారన్న ప్రకాష్ రాజ్. బైలాస్‌ మార్చబోమని హామీ ఇస్తేనే రాజీనామాలు వెనక్కు తీసుకుంటామన్నారు.

ఇదిలా ఉంటే ప్రెస్‌మీట్ సమయంలో టాలీవుడ్ సీనియర్ నటుడు బెనర్జీ ఎమోషనల్ అయ్యారు. ఎన్నికల సమయంలో విష్ణుతో గొడవలు వద్దని చెప్పడానికి వెళ్లిన తనపై మోహన్‌బాబు కొట్టడానికి వచ్చారని బోరున విలపించారు. అటు ఉత్తేజ్ సైతం సంచలన ఆరోపణలు చేశారు. నరేష్ తన తల్లిని దుర్భాషలాడారని వాపోయారు. పోలింగ్ రోజు బారికేడ్లతో తమను అడ్డుకున్నారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.

ఇదంతా ఒకెత్తయితే ప్రకాష్‌రాజ్ 11సభ్యుల రాజీనామాలతో బైలాపై చర్చ షురూ అయిపోయింది. 'మా' బైలా రూల్ నెం.17లో ఉన్న నిబంధన ప్రకారం రాజీనామా చేసిన సభ్యుల స్థానంలో కొత్తవారిని నియమించుకోవచ్చని తెలుస్తోంది. అధ్యక్షుడిగా ఆ అధికారం విష్ణుకు ఉంది. మాలో ఏ సభ్యుడినైనా విష్ణు నామినేట్ చేసుకోవచ్చని తెలుస్తోంది.

Full View


Tags:    

Similar News