Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు 'అభినవ కృష్ణదేవరాయ' బిరుదు..!
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం లభించింది.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు అరుదైన గౌరవం లభించింది. పుట్టిగే శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ సుగునేంద్ర తీర్థ స్వామీజీ ఆయనకు ‘అభినవ కృష్ణదేవరాయ’ బిరుదు ప్రదానం చేశారు. ఈ బిరుదుని ఆయన సేవా కార్యక్రమాలకు, హిందూ ధర్మ పరిరక్షణకు గుర్తింపుగా వర్ణించారు స్వామీజీ.
ఉడుపిలో శ్రీ కృష్ణ మఠంలో జరిగిన వైభవోపేత కార్యక్రమంలో, పుట్టిగే శ్రీకృష్ణ మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ.. పవన్ కళ్యాణ్‌కు ‘అభినవ కృష్ణదేవరాయ’ బిరుదును ప్రకటించారు. విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల తర్వాత ఈ బిరుదు ఎవరికీ ఇవ్వలేదని, పవన్ కళ్యాణ్ హిందూ ధర్మ పరిరక్షణలో చేస్తున్న కృషికి గుర్తుగా ఈ గౌరవం అందజేస్తున్నట్టు స్వామీజీ పేర్కొన్నారు.
గతంలో కర్నాటకలో హిందువులపై జరిగిన దాడులను అడ్డుకోవడం, రాష్ట్రంలో ధర్మరక్షణకు చేపట్టిన చర్యలను స్వామీజీ ప్రస్తావించారు. ఈ బిరుదు ప్రదానోత్సవంలో జనసేన నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఈ గౌరవాన్ని హిందూ సమాజం అందించిన బహుమతిగా భావిస్తున్నానని స్వామీజీకి కృతజ్ఞతలు తెలిపారు.