Anushka Shetty: ఆ ఒక్క రీజన్‌తో రూ.5 కోట్లు వదులుకున్న అనుష్క.. ఇంతకీ అదేంటంటే..?

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అనుష్క శెట్టి. నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు అనుష్క. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపేడేశారు.

Update: 2025-02-18 09:49 GMT

Anushka Shetty: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అనుష్క శెట్టి. నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు అనుష్క. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపేడేశారు. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడంతో స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కింది. అందులో చాలా సినిమాలు సక్సెస్ సాధించడంతో అత్యంత తక్కువ కాలంలోనే అనుష్క తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ మారారు.

గ్లామర్ హీరోయిన్స్ రోల్స్ మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి నటిగా ప్రశంసలు అందుకున్నారు. కెరీర్ ప్రారంభంలో కమర్షియల్ సినిమాల్లో నటించిన అనుష్క.. స్టార్ ఇమేజ్ వచ్చాక ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుని.. అద్భుతమైన నటనతో మెప్పించారు. బాహుబలి, బాహుబలి2 చిత్రాలు అనుష్క కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయాయి. దేవసేన పాత్రలో యువరాణిగా, ప్రభాస్ తల్లిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి మెస్మరైజ్ చేశారు. పాత్రకు వెయిట్ ఉంటే చిన్న హీరోలతో సైతం నటించేందుకు రెడీ అయ్యారు.

బాహుబలి తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న అనుష్క.. ఆ తర్వాత నవీన్ పొలిశెట్టి సరసన మిస్ శెట్టి మిసెస్ పొలిశెట్టి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆ తర్వాత ఓ స్టార్ హీరో సినిమాలో అనుష్కకు మంచి ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఆ సినిమా కోసం ఆమెకు రూ.5 కోట్లు పారితోషికం ఇస్తామని చెప్పారట.. కానీ ఆ సినిమాలో నటించేందుకు అనుష్క అంగీకరించలేదని టాక్. ఎందుకంటే ఆ సినిమాలో అనుష్క పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడమే అందుకు కారణమని సమాచారం. అప్పటికే అనుష్కకు అవకాశాలు తగ్గిపోయాయి. అయినా వచ్చిన ఆఫర్ సైతం పాత్రకు ప్రాధాన్యత ఉండాలని రిజెక్ట్ చేశారు. అవకాశాలు లేని సమయంలో మరికొందరైతే వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునేవారు. కానీ నటనకు ప్రాధాన్యత లేదని రిజెక్ట్ చేశారు అనుష్క. దీంతో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే ప్రస్తుతం అనుష్క ఘాటీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క మాస్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ఏప్రిల్ 18న విడుదల కానుంది.

Tags:    

Similar News