Pawan Kalyan: ‘ఇకపై గాజు గ్లాసులోనే టీ తాగుతా’.. పవన్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి పవన్ గెలుపుపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు.
Pawan Kalyan: ‘ఇకపై గాజు గ్లాసు’లోనే టీ తాగుతా’.. పవన్ తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
Pawan kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో పిఠాపురంలో గెలుపొందారు పపన్ కళ్యాణ్. ఇంకా ఆయన పార్టీ నుంచి పోటీ చేసిన అందరూ కూడా అన్ని స్థానాల్లోనూ విజయ కేతనం ఎగిరేశారు. దీంతో అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇటు జనసైనికులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిరంజీవి, చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, ఉపాసన, నాగబాబు, పవన్ సోదరీమణులు.. ఇలా మెగా ఫ్యామిలీ అంతా సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తల్లి అంజనా దేవి పవన్ గెలుపుపై స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అంజనా దేవి మాట్లాడుతూ.. ‘ ఇవాళ మా అబ్బాయి రాజకీయాల్లో విజయం సాధించాడు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వాడు పడ్డ కష్టానికి భగవంతుడు మంచి ఫలితమే ఇచ్చాడు. ఈ రోజు నుంచి నేను గాజు గ్లాస్ లోనే టీ తాగుతాను’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.