Mahavatar Narasimha: రికార్డులు బద్ధలు కొడుతున్న మహా అవతార్ నరసింహ.. ఏకంగా ఆ క్లబ్‎లో చేరిక..!

Mahavatar Narasimha: ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో వచ్చిన యానిమేషన్ చిత్రం మహా అవతార్ నరసింహ ఇప్పుడు బాక్సాఫీస్‌ వద్ద కొత్త చరిత్ర సృష్టిస్తోంది.

Update: 2025-08-28 11:01 GMT

 Mahavatar Narasimha: రికార్డులు బద్ధలు కొడుతున్న మహా అవతార్ నరసింహ.. ఏకంగా ఆ క్లబ్‎లో చేరిక..!

Mahavatar Narasimha: ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో వచ్చిన యానిమేషన్ చిత్రం మహా అవతార్ నరసింహ ఇప్పుడు బాక్సాఫీస్‌ వద్ద కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ యానిమేషన్ చిత్రం సాధించని రికార్డును అందుకుంది. జులై 25న విడుదలైన ఈ చిత్రం, ప్రారంభంలో పెద్దగా ప్రచారం లేకపోయినా కేవలం ఒక వారంలోనే అద్భుతమైన కంటెంట్, హోంబలే ఫిల్మ్స్ మార్కెటింగ్ వ్యూహాల వల్ల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలిగింది.

రూ.300 కోట్ల మార్క్‌ను దాటిన తొలి యానిమేషన్ చిత్రం

విడుదలైన 30 రోజుల్లోనే మహా అవతార్ నరసింహ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పటి వరకు ఏ భారతీయ యానిమేషన్ చిత్రం ఇంత భారీ మొత్తం సంపాదించలేదు. అంతేకాదు, గత రెండేళ్లలో విడుదలైన స్పైడర్‌మ్యాన్, డాక్టర్ స్ట్రేంజ్, థోర్, అవతార్ వంటి హాలీవుడ్ యానిమేషన్ చిత్రాలు కూడా భారతదేశంలో ఇంత మొత్తం వసూలు చేయలేదంటే ఈ సినిమా విజయం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.

సినిమాలో ఏముంది?

మహా అవతార్ నరసింహ చిత్రంలో విష్ణుమూర్తి ఐదవ అవతారమైన నరసింహస్వామి కథను యానిమేషన్ రూపంలో చూపించారు. ఆష్విక్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్ నిర్మించారు. ఈ సినిమా తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కింది. అందుకే నిర్మాణానికి ఎక్కువ సమయం పట్టింది. ఈ సినిమా విజయం సాధించడంతో, దర్శకుడు ఆష్విక్ భవిష్యత్తులో రాబోయే చిత్రాలను మరింత ఉన్నతమైన నాణ్యతతో నిర్మిస్తామని చెప్పారు.

మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్

ఈ సినిమా విజయం సాధించడంతో, చిత్ర బృందం మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్‌ను నిర్మించాలని ప్రణాళికలు వేసింది. దీనిలో విష్ణువు పది అవతారాల ఆధారంగా సినిమాలు నిర్మిస్తారు. రాబోయే పదేళ్లలో ఏడు సినిమాలు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అవి మహా అవతార్ నరసింహ (2025), మహా అవతార్ పరశురామ (2027), మహా అవతార్ రఘునందన (2029), మహా అవతార్ ధ్వారకాధీశ (2031), మహా అవతార్ గోకులానంద (2033), మహా అవతార్ కల్కి పార్ట్ 1 (2035), మహా అవతార్ కల్కి పార్ట్ 2 (2037). ఈ సినిమాటిక్ యూనివర్స్ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

Tags:    

Similar News