Thanu Radhe Nenu Madhu: ప్రేమలో ఎమోషన్స్ కు కొత్త నిర్వచనం.. ఓటీటీలో 'తను రాధే నేను మధు'కి అద్భుతమైన స్పందన!
Thanu Radhe Nenu Madhu: కుటుంబమంతా కలిసి చూడదగిన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈటీవీ విన్, 'కథా సుధ' పేరుతో ప్రతి వారం ఒక కొత్త షార్ట్ మూవీని విడుదల చేస్తోంది.
Thanu Radhe Nenu Madhu: కుటుంబమంతా కలిసి చూడదగిన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న ఈటీవీ విన్, 'కథా సుధ' పేరుతో ప్రతి వారం ఒక కొత్త షార్ట్ మూవీని విడుదల చేస్తోంది. దీనిలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ దర్శకత్వంలో 'తను రాధే.. నేను మధు' అనే కొత్త ఎపిసోడ్ సెప్టెంబర్ 14న విడుదలైంది. 33 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆర్.పి. పట్నాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక విదేశీ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. స్వచ్ఛమైన ప్రేమలో ఉండే నమ్మకం, సహనం, భావోద్వేగాలను 33 నిమిషాల నిడివిలో చాలా సున్నితంగా చూపించారు. క్లైమాక్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసేలా రూపొందించారు.
లక్ష్మీ దుర్గ కత్తి, జయవంత్ పసుపులేటి ప్రధాన పాత్రలు పోషించగా, ఋషి కిరణ్, శ్రీధర్ భూమిరెడ్డి ముఖ్య పాత్రల్లో నటించారు. వందల సినిమా ఈవెంట్లు, సెలబ్రిటీ ఇంటర్వ్యూలు హోస్ట్ చేసి స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న గీతా భగత్ ఈ షార్ట్ మూవీతో నిర్మాతగా మారారు. రఘురాం బొలిశెట్టితో కలిసి ఆమె ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ షార్ట్ మూవీ మొత్తం అమెరికాలోనే చిత్రీకరించబడింది. 'తను రాధే.. నేను మధు' విడుదలైన కొన్ని గంటల్లోనే అద్భుతమైన వ్యూయర్ షిప్ సాధించి ట్రెండింగ్‌లో ఉంది. ఆర్.పి. పట్నాయక్ దర్శకత్వ ప్రతిభ, గీతా భగత్ నిర్మాతగా చేసిన ప్రయత్నం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.