Actress: గుర్తుపట్టలేనంతలా మారిన తెలుగమ్మాయి.. ఇంతకీ బ్యూటీ ఎవరో తెలుసా.?
Anandhi: నల్ల లుంగీ, చొక్కాతో కాలు పై కాలు వేసుకొని స్టైల్ గా కళ్లజోడు పెట్టుకొని మాస్ లుక్‌లో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా.?
Actress: గుర్తుపట్టలేనంతలా మారిన తెలుగమ్మాయి.. ఇంతకీ బ్యూటీ ఎవరో తెలుసా.?
Anandhi: ఒకప్పుడు హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం అనే భావన ఉండేది. అయితే కాలుతోన్న మారంతో పాటు సినిమాలు మారుతున్నాయి. ముఖ్యంగా లేడీ ఓరియెంట్ మూవీలు పెరగడంతో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. పైన ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఇదే జాబితాలోకి వస్తుంది.
నల్ల లుంగీ, చొక్కాతో కాలు పై కాలు వేసుకొని స్టైల్ గా కళ్లజోడు పెట్టుకొని మాస్ లుక్‌లో కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా.? ఈ చిన్నది తెలుగమ్మాయని మీకు తెలుసా.? ఇంతకి ఈ హీరోయిన్ మరెవరో కాదు అందాల తార ఆనంది. వరంగల్‌లో జన్మించిన ఈ అందాల తార ఈ రోజుల్లో, బస్ స్టాప్, జాంబి రెడ్డి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం శివంగి అనే సినిమాలో నటిస్తోందీ బ్యూటీ.
ఈ క్రమంలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దేవరాజ్ భరణి ధరణ్ తెరకెక్కిస్తోన్న శివంగి సినిమాలో ఆనందితో పాటు వరలక్ష్మి శరత్‌కుమార్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రాన్ని మార్చి 7వ తేదీన విడుదల చేసేందకు సిద్ధమవుతున్నారు. మరి ఈ సినిమా ఆనంది కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.