Yemi Maya Premalona: యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌తో దూసుకుపోతున్న ఏమి మాయ ప్రేమలోన

Yemi Maya Premalona Music Album Goes Viral A Hit Tale of Love Set in Kerala

Update: 2025-10-07 07:47 GMT

Yemi Maya Premalona: సాధారణంగా సినిమాలకే పరిమితమైన ఆదరణ, ఇప్పుడు మ్యూజిక్ ఆల్బమ్స్‌కు కూడా దక్కుతోంది. ఈ కోవలోకి వస్తూ ఏమి మాయ ప్రేమలోన అనే ఒక రొమాంటిక్ మ్యూజిక్ ఆల్బమ్ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంటోంది. అకి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ పాట, దసరా కానుకగా యూట్యూబ్‌లో విడుదలై, భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ పాటలో హీరోగా నటించిన అనిల్ ఇనుమడుగు దర్శకత్వంతో పాటు సాహిత్యాన్ని కూడా అందించడం విశేషం.

ఏమి మాయ ప్రేమలోన పాట ఒక సున్నితమైన ప్రేమకథాంశంతో రూపొందించబడింది. కేరళలో టూరిస్ట్ గైడ్‌గా పనిచేసే ఒక అనాథ అబ్బాయి, మెరుపులా తన జీవితంలోకి వచ్చిన అమ్మాయి ప్రేమను ఎలా గెలుచుకున్నాడు అనే అంశంపై ఈ పాట ఉంటుంది. పాట కథాంశంతో పాటు, అనిల్ ఇనుమడుగు అందించిన దర్శకత్వం కూడా ప్రశంసలు అందుకుంటోంది. సుమారు పది నిమిషాల నిడివి ఉన్న ఈ పాటను యంగ్ నిర్మాతలు అజయ్ కుమార్, విష్ణు పాదర్తి నిర్మించారు.

ఈ పాట విజయానికి సంగీతం, సినిమాటోగ్రఫీ మెయిన్ అట్రాక్షన్ అనే చెప్పాలి. మార్క్ ప్రశాంత్ అందించిన సంగీతం శ్రోతలను వెంటనే ఆకట్టుకునేలా ఉంది. ధినకర్, దివ్య ఐశ్వర్య గానం ప్రేక్షకులను ప్రేమలో ముంచెత్తుతోంది. ఇక, శ్రవణ్ అందించిన సినిమాటోగ్రఫీ అయితే అద్భుతం అని చెప్పాలి. కేరళలోని అందమైన ప్రదేశాలను ఆయన ప్రతి ఫ్రేమ్‌లోనూ అద్భుతంగా చిత్రీకరించారు. విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, పాటను ఒక చిన్న సినిమా చూసిన అనుభూతిని అందించేలా రూపొందించారు.

ప్రధాన పాత్రల్లో నటించిన అనిల్(హీరో), వేణి రావు (హీరోయిన్) జోడీ తెరపై చాలా నేచురల్ గా నటించింది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరి, ప్రేమకథకు మరింత జీవం పోసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పాట, యువ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ, మ్యూజిక్ ఆల్బమ్స్‌కు మంచి భవిష్యత్తును సూచిస్తోంది.

Full View


Tags:    

Similar News