Allu Sirish: పాలకొల్లులో అల్లు శిరీష్ సందడి
*పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అల్లు శిరీష్ సందడి చేశారు
Allu Sirish: పాలకొల్లులో అల్లు శిరీష్ సందడి
Allu Sirish: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అల్లు శిరీష్ సందడి చేశారు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన పాలకొల్లు టాక్సీ స్టాండ్ సెంటర్లోని అల్లు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేశారు. తన చిన్న వయసులో పాలకొల్లు గురించి తెలియక తాను ఇక్కడికి రాలేకపోయామని..ఇకనుంచి తరచుగా పాలకొల్లు వస్తానని అల్లు శిరీష్ తెలిపారు. ఊర్వసివో రాక్షసివో సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఉభయగోదావరి జిల్లాల్లో అల్లు శిరీష్ పర్యటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ తనకు రాజకీయాల పట్ల ఎలాంటి అవగాహన, ఆసక్తి లేదన్నారు.