Allu Arjun-Trivikram: బన్నీతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాయాజాలం?

టాలీవుడ్‌‌లో కొన్ని కాంబోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా హిట్ కాంబోస్‌పై మరింత హైప్ ఉంటుంది.

Update: 2025-01-27 12:15 GMT

బన్నీతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాయాజాలం?

Allu Arjuns Next Movie With Trivikram Srinivas: టాలీవుడ్‌‌లో కొన్ని కాంబోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా హిట్ కాంబోస్‌పై మరింత హైప్ ఉంటుంది. అలా ఇండస్ట్రీలో హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్న వారిలో హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో.. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడమే కాదు.. బన్నీ కెరీర్‌లో బిగ్ హిట్‌స్ గా నిలిచాయి. అలాంటిది వీరిద్దరి కాంబోలో మరో ప్రాజెక్ట్ రాబోతుండడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ సినిమాపైనే ఉంది. ఇప్పటికే పుష్ప2తో ఓ రేంజ్‌కి ఎదిగిన బన్నీని.. త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నారు? ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే చర్చ మొదలైంది.

త్రివిక్రమ్ రైటింగ్ గురించి, డైలాగ్స్ గురించి చెప్పాల్సిన అవసరంలేదు. ఇక ఆయన మాటలకు బన్నీ జత అయితే ఎలాంటి హిట్స్ వస్తాయో గత సినిమాలే నిదర్శనం. అందుకే తమ కాంబోలో రాబోతున్న నాలుగో ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ మాస్టర్ ప్లానే వేసినట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ ఈ సినిమాలో సుబ్రహ్మణ్య స్వామిగా కనిపించనున్నారని సమాచారం. గాడ్ ఆఫ్ వార్‌గా కార్తీకేయుడికి ఉన్న పేరుకు తగ్గట్టుగా సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఉంటుందని, పురాణాల స్ఫూర్తిగా త్రివిక్రమ్ ఈ సినిమా కథను సిద్ధం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఏడాది క్రితమే ఈసినిమా అనౌన్స్ అయినప్పటికీ... అప్పటి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు.

ప్రస్తుతం ప్యాన్ ఇండియన్ మార్కెట్‌లో పురాణ ఇతిహాస కథలకు మంచి మార్కెట్ ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. పురాణాల రిఫరెన్సులతో ఆడియన్స్‌ను ఈజీగా మాయ చేయగలరని నెటిజన్లు అంటున్నారు. మరి వీరి కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది.

ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ఫ2 ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో చెప్పక్కర్లేదు. పుష్ప సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన బన్నీ.. తన నెక్ట్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. బన్నీ పుష్ఫ3తో పాటు త్రివిక్రమ్ ప్రాజెక్టు, అట్లీ, సందీప్ రెడ్డి వంగ, సంజయ్ లీలా భన్సాలీలతో ప్రాజెక్ట్స్ చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది.

Tags:    

Similar News