ప్యాన్ ఇండియన్ సినిమాలకు ఎదురెళ్లి గెలిచిన మహేష్ బాబు

The Film That Has Achieved Good Collections at the Box Office is Sarkaru Vari Pata.
x

ప్యాన్ ఇండియన్ సినిమాలకు ఎదురెళ్లి గెలిచిన మహేష్ బాబు

Highlights

*ప్యాన్ ఇండియన్ సినిమాలను తట్టుకొని నిలబడిన మహేష్ బాబు సినిమా

Mahesh Babu: ఈమధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ ప్యాన్ ఇండియన్ సినిమాల వెనుక పరుగులు తీస్తున్నారు. "ఆర్ ఆర్ ఆర్", "కే జి ఎఫ్ 2" వంటి ప్యాన్ ఇండియన్ సినిమాలు బ్లాక్ బస్టర్లు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ప్యాన్ ఇండియన్ సినిమాల మీదే పడింది. అందరు స్టార్ హీరోలు భారీ బడ్జెట్ తో సినిమాలు తీసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి ప్యాన్ ఇండియన్ సినిమాలు విడుదలైనప్పుడు ఆ సినిమాల తరువాత విడుదలయ్యే కొన్ని స్టార్ హీరోల సినిమాల మీద కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఉదాహరణకు "ఆర్ ఆర్ ఆర్" తర్వాత చిరంజీవి మరియు రామ్ చరణ్ నటించిన "ఆచార్య" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది.

"మేజర్", "విక్రమ్" వంటి సినిమాలకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించినప్పటికీ కలెక్షన్ల పరంగా అంతంతమాత్రంగానే మిగిలాయి. కానీ ఇలాంటి ప్యాన్ ఇండియన్ సినిమాల మధ్య కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధించిన సినిమా "సర్కారు వారి పాట". సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించారు. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు సినిమాని చూడటం కోసం థియేటర్లకు తరలివచ్చారు. నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్ లు మరియు బయర్లు కూడా ఈ సినిమాతో సేఫ్ జోన్ లోకి వచ్చేసారు. కంటెంట్ అంతంత మాత్రం గానే ఉన్నప్పటికీ మహేష్ బాబు బ్రాండ్ వాల్యూ అలాంటిది అని అభిమానులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories