Allu Arjun: ‘బాస్ ఈజ్ బ్యాక్’ చిరంజీవి చిత్రంపై అల్లు అర్జున్ సూపర్ ట్వీట్

Allu Arjun: చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ మెగాస్టార్ రీఎంట్రీని కొనియాడారు.

Update: 2026-01-20 12:45 GMT

Allu Arjun: ‘బాస్ ఈజ్ బ్యాక్’ చిరంజీవి చిత్రంపై అల్లు అర్జున్ సూపర్ ట్వీట్

Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. సినిమాను చూసిన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మెగాస్టార్ రీఎంట్రీ అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు.

“మన బాస్ మళ్లీ వచ్చాడు. మెగాస్టార్ చిరంజీవిని తెరపై చూడటం ఎంతో సంతోషంగా ఉంది. పూర్తి వింటేజ్ వైబ్స్ కనిపించాయి” అని అల్లు అర్జున్ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ చిత్రం కేవలం బ్లాక్‌బస్టర్ మాత్రమే కాకుండా, ‘సంక్రాంతి బాస్-బస్టర్’గా నిలిచిందని అభిప్రాయపడ్డారు.

సినిమాలో కీలక పాత్రలో నటించిన వెంకటేష్ నటనపై ప్రత్యేకంగా స్పందించిన బన్నీ, ‘వెంకీ గౌడ’ పాత్రను అద్భుతంగా పోషించారని ప్రశంసించారు. కన్నడలో “తుంబ చెన్నాగి మాడిదిరా” అంటూ అభినందనలు తెలిపారు. నయనతార గ్రేస్‌ఫుల్ ప్రజెన్స్‌తో ఆకట్టుకోగా, కేథరిన్ ట్రెసా హాస్యంతో అలరించిందని పేర్కొన్నారు.

దర్శకుడు అనిల్ రావిపూడిని ‘సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మెషిన్’గా అభివర్ణించిన అల్లు అర్జున్, నిర్మాతలు సుస్మిత కొణిదెల, సాహు గారపాటిలతో పాటు మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అల్లు అర్జున్ చేసిన ఈ సుదీర్ఘ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Tags:    

Similar News