Pushpa Movie Review: తగ్గేదే లే.. "పుష్ప" మూవీలో ఎవరి పాత్ర ఎలా ఉందంటే..

Update: 2021-12-17 03:05 GMT

Pushpa Movie Review: బన్నీ వన్ మ్యాన్ షో.. "పుష్ప"లో ఎవరి పాత్ర ఎలా ఉందంటే..

Pushpa Movie Review: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం "పుష్ప" డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ట్విట్టర్ రివ్యూలో మంచి టాక్ సంపాదించిన పుష్ప సినిమా కథ విషయానికి వస్తే... చిన్నప్పటి నుండి అనాదరణకు గురైన పుష్ప రాజ్ ఎర్ర చందనం స్మగ్లింగ్ లో అడుగుపెడతాడు. చెట్లు నరికే కూలీగా గ్యాంగ్ లో చేరిన పుష్ప తన తెగింపు, ధైర్యంతో తక్కువ కాలంలోనే మాఫియాలో కీలక వ్యక్తిగా ఎదుగుతాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ లో కింగ్స్ గా ఉన్నవారికి పుష్ప రాజ్ తలనొప్పిగా మారి, వాళ్లకు చుక్కలు చూపిస్తాడు. అసలు పుష్ప రాజ్ నేపథ్యం ఏంటి అనేది క్లైమాక్స్ ట్విస్ట్..!!

"పుష్ప" సినిమాలో సుకుమార్ తన ఫోకస్ మొత్తం అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్ర పైనే పెట్టారు. సినిమా చూస్తున్నంతసేపు అల్లు అర్జున్ ని చూస్తున్న భావన కలగదు. అల్లు అర్జున్ మేనరిజం అద్భుతంగా ఉందని నెటిజన్స్ తమ అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు. పుష్ప అల్లు అర్జున్ వన్ మాన్ షో అనేది ట్విట్టర్ కామెంట్స్ ద్వారా అర్థమవుతుంది.


హీరోయిన్ రష్మిక మంధనకు మాత్రం నెటిజన్స్ నుండి నెగిటివ్ మార్క్స్ వేస్తున్నారు. డీగ్లామర్ రోల్ లో ఆమె లుక్ నచ్చలేదంటున్నారు. హీరోతో ఆమె లవ్ ట్రాక్ ఏమంతగా ఆకట్టుకోలేదట. నటన పరంగా పాజిటివ్ గా స్పందిస్తున్న ట్విట్టర్ పీపుల్, ఆమె లుక్ పట్ల పెదవి విరుస్తున్నారు.


పుష్ప చిత్రంలో సునీల్.. మాఫియా సిండికేట్ లో కీలక వ్యక్తిగా మంగళం శ్రీను పాత్ర ప్రేక్షకులను మెప్పించినట్లు ట్విట్టర్ ద్వారా తెలుస్తుంది. హాస్యనటుడిగా సినిమాలు చేసిన సునీల్ "పుష్ప" చిత్రంలో విలన్ గా సహజంగా నటించాడు.


యాంకర్ అనసూయ.. దాక్షయని పాత్రలో మంగళం శ్రీనుకు భార్య పాత్రలో నటించింది. అనసూయ ఫస్ట్ లుక్ పోస్టర్, పాత్ర చూసి సినిమాలో తన పాత్ర నిడివి ఎక్కువసేపు ఉంటుందని అనుకుంటే పొరపాటే. రామ్ చరణ్ "రంగస్థలం" సినిమాలో అంతగా తన పాత్రలేదని ట్విట్టర్ రివ్యూ టాక్.


పుష్ప సినిమాలో మరొక ప్లస్ పాయింట్ సమంత ఐటెం సాంగ్. ఈ సాంగ్ లో సమంత గ్లామర్, మాస్ స్టెప్పులతో ఫ్యాన్స్ కి పండగే అంటున్నారు. సినిమాకు మంచి ఊపుతెచ్చిన సాంగ్ గా సమంత ఐటెం సాంగ్ పై పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.


పుష్ప మెయిన్ విలన్ గా ప్రచారమవుతున్న ఫహద్ ఫాజిల్ ఎంట్రీ చివర్లో ఉంటుంది. ఆయన పాత్ర గురించి ఎక్కువ అంచనాలు ఉన్నా ఆయనను సెకండ్ పార్ట్ కి పరిమితం చేశారేమో అనిపిస్తుంది. పుష్ప మొదటి పార్ట్ లో ఫహద్ చివరి 30 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు.



Tags:    

Similar News