సూపర్ హిట్ సినిమాని ప్రమోషన్స్ లేకుండా విడుదల చేసిన అల్లు అరవింద్
* ఉన్ని ముకుందన్ సినిమాని ప్రమోట్ చేయకుండానే విడుదల చేసిన టాలీవుడ్ స్టార్ నిర్మాత
సూపర్ హిట్ సినిమాని ప్రమోషన్స్ లేకుండా విడుదల చేసిన అల్లు అరవింద్
Allu Aravind: భాషా బేధాలు లేకుండా తెలుగు ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. అసలు మనకు ఏ మాత్రం తెలియని కర్ణాటక ఆచారాల ఆధారంగా విడుదలైన "కాంతారా" సినిమా తెలుగులో కూడా అతిపెద్ద హిట్ అవ్వటం దీనికి ఉదాహరణ. భాష మరియు నటీనటులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలకు ఎప్పుడు బ్రహ్మరథం పడతారు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న టాలీవుడ్ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ కూడా మలయాళం లో సూపర్ హిట్ అయిన ఒక సినిమాని తెలుగులో డబ్ చేశారు అదే "మలికప్పురం".
ప్రముఖ మలయాళం నటుడు ఉన్ని ముకుందన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఉన్ని ముకుందన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. అనుష్క "భాగమతి" సినిమాలో నటించిన ఉన్ని ముకుందని ఈ మధ్యనే సమంత హీరోయిన్గా విడుదలైన "యశోద" సినిమాలో కూడా విలన్ పాత్రలో కనిపించారు. అయ్యప్ప మాల వేసుకునే వారి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. మలయాళం లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు అల్లు అరవింద్. కానీ అల్లు అరవింద్ ఈ సినిమా ప్రమోషన్ల పై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. తమిళ్ వర్షన్ ప్రమోషన్ల కోసం చిత్ర బృందం చెన్నై దాకా వెళ్ళింది కానీ తెలుగులో మాత్రం సినిమాని ఏమాత్రం ప్రమోట్ చేయలేదు.
ఈ వారం విడుదలైన సుధీర్ బాబు "హంట్" సినిమాకి కూడా పెద్దగా మంచి ఆదరణ లభించకపోవడంతో "మలికప్పురం" సినిమాకి మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. కానీ సినిమాని ఏమాత్రం ప్రమోట్ చేయకపోవడంతో అసలు సినిమా విడుదలైన విషయం కూడా చాలామందికి తెలియకుండా పోయింది. మరి ఇంత మంచి పొటెన్షియల్ ఉన్న సినిమాని ఎందుకు ప్రమోట్ చేయలేదో ఇంకా తెలియాల్సి ఉంది.