Akkineni Akhil: అక్కినేని అఖిల్-జైనబ్ పెళ్లి డేట్ ఫిక్స్..పెళ్లి వేదిక ఎక్కడంటే?

Update: 2025-01-24 12:21 GMT

Akkineni Akhil: అక్కినేని నాగార్జున-అమల తనయుడు అఖిల్ పెళ్లి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఏజెంట్ సినిమా తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న అఖిల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలోనే బ్యాచిలర్ లైఫ్ కు అఖిల్ గుడ్ బై చెప్పబోతున్నట్లు నాగార్జున తెలిపారు. జైనబ్ రవడ్జీతో ఎంగేజ్ మెంట్ జరిగినట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేస్తూ అందర్నీ షాక్ కు గురిచేశారు. దీంతో అఖిల్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరుగుతోంది. అయితే మార్చి 24వ తేదీన అఖిల్ పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లి గురించి చర్చలు కూడా జరుపుకుని తేదీని ఫిక్స్ చేశారన్న టాక్ వినిపిస్తోంది.

అఖిల్ జైనబ్ ల వివాహం ఘనంగా చేసేందుకు ఇరు కుటుంబాల సభ్యులు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ వివాహ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో అక్కినేని అభిమానులు కూడా తెగ ఖుషీ అవుతున్నారు. అయితే ఆ పెళ్లి ఎక్కడ ఏ ప్లేసులో జరగనుందో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అఖిల్ తన అన్నయ్య నాగచైతన్య వలే ఇండియాలో చేసుకుంటారా లేదా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా అనే ఆసక్తి పెరిగింది.

అయితే తాజాగా అఖిల్ పెళ్లి వేదిక ఖరారు అయినట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. అఖిల్ తన అన్న, వదిన బాటలోనే నడవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. తన పెళ్లిని కూడా అన్నపూర్ణ స్టూడియో లోనే చేసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న అక్కినేని ఫ్యాన్స్ మాత్రం గ్రేట్ అంటున్నారు. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని ఫ్యామిలీకి సెంటిమెంట్ ప్లేస్ అనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు నాగార్జున ఈ విషయాన్ని చెప్పారు. సో అఖిల్ నిర్ణయాన్ని కాదనలేకపోయారు కావచ్చని అనుకుంటున్నారు. 

Tags:    

Similar News