Akkineni Akhil: అఖిల్ కోసం రంగంలోకి ప్రశాంత్ నీల్
Akkineni Akhil: అక్కినేని అఖిల్ కెరీర్‌లో కీలక మలుపు తిరిగే చిత్రం కోసం సిద్ధమవుతున్నారు.
Akkineni Akhil: అక్కినేని అఖిల్ కెరీర్‌లో కీలక మలుపు తిరిగే చిత్రం కోసం సిద్ధమవుతున్నారు. ‘లెనిన్’ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వ బృందంలోని సహాయక దర్శకుడితో కొత్త చిత్రానికి అఖిల్ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు.
‘కెజిఎఫ్’, ‘సలార్’తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ బృందంలో, ప్రముఖ సహాయ దర్శకుడు తెరకెక్కించబోయే చిత్రంలో అక్కినేని అఖిల్ హీరోగా నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు అంతిమ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘లెనిన్’ సినిమా తర్వాత అఖిల్ కెరీర్‌లో భారీ విజయం సాధించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని ఎంచుకుంటున్నారు.
ప్రశాంత్ నీల్ శైలి ప్రభావం ఈ చిత్రంలోనూ కనిపిస్తుందని, ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే అవకాశం ఉందని సమాచారం. అఖిల్ గత చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై అక్కినేని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.