Akhil Akkineni New Movie: మరో భారీ ప్రాజెక్టులో అఖిల్
Akhil Akkineni New Movie: అఖిల్ అక్కినేని త్వరలో , మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా చేయనున్నారని సమాచారం.
Akhil Akkineni
Akhil Akkineni New Movie: వరుస పరాజయాలు ఎదురవుతున్నా క్రేజీ ప్రాజెక్టులతో ప్రతి సినిమాకు హైప్ క్రియేట్ చేసుకుంటున్న అఖిల్ అక్కినేని ఇప్పటికే ఏజెంట్ మూవీ లుక్స్ తో కేక పెట్టిస్తున్నాడు. మరోవైపు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఇప్పుడు లేటెస్టుగా భారీ సినిమాలు నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో మరో సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే సినిమాను చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. వరుస పరాజయాలతో సతమతమవుతోన్నఅఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా విజయం చాలా కీలకం.
ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉన్నట్లు సమాచారం. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుందని చిత్రబృందం ప్రకటించింది. అయితే ప్రస్తుత కరోనా సమయంలో ఈ సినిమా అనుకున్న తేదిలో విడుదల కావడం అసాధ్యంగా మారింది.